Pakistan vs England 1st test : టెస్టును టీ20 ఆడిన ఇంగ్లండ్.. పాక్ పై ఏకంగా ఒకేరోజులో నాలుగు సెంచరీలు.. ఇదో రికార్డ్

Pakistan vs England 1st test :  పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ తొలి టెస్ట్ లో రికార్డులు బద్దలయ్యాయి. తొలి టెస్టులో ఏకంగా నలుగురు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ సెంచరీలు చేయడం సంచలనమైంది. ఇదో ప్రపంచ రికార్డుగా నమోదైంది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఇదో టెస్ట్ మ్యాచ్అన్న సంగతి మరిచిపోయి టీ20లా ఆడేశారు. సిక్సులు, ఫోర్లు కొడుతూ భారీ స్కోరు నమోదు చేశారు. దీంతో పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజు […]

Written By: NARESH, Updated On : December 1, 2022 6:54 pm
Follow us on

Pakistan vs England 1st test :  పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ తొలి టెస్ట్ లో రికార్డులు బద్దలయ్యాయి. తొలి టెస్టులో ఏకంగా నలుగురు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ సెంచరీలు చేయడం సంచలనమైంది. ఇదో ప్రపంచ రికార్డుగా నమోదైంది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఇదో టెస్ట్ మ్యాచ్అన్న సంగతి మరిచిపోయి టీ20లా ఆడేశారు. సిక్సులు, ఫోర్లు కొడుతూ భారీ స్కోరు నమోదు చేశారు.

దీంతో పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలిరోజు ఏకంగా 506-4 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఖ్యాతికెక్కింది. ఇంతవరకూ ఏ జట్టు కూడా ఒక్కరోజులో ఇన్ని పరుగులు టెస్టుల్లో చేయలేదు. ఇంగ్లండ్ టీం 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. మొదటి రోజే నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు చేయడం కూడా ఓ రికార్డుగా చెప్పొచ్చు.

గురువారం రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు 500 పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ నిలిచింది. పాక్‌ బౌలర్లను ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ చితక్కొట్టారు. టీ20లా ఆడేశారు. నలుగురు ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడంతో పర్యాటక జట్టు ఆట ముగిసే సమయానికి 506-4తో నిలిచింది. ఓపెనర్లు క్రావ్లే 122, బెన్ డకెట్ 107, ఓలీపోప్ 108, హెరీ బ్రూక్ 101 పరుగులు సాధించడంతో ఈ భారీ స్కోరు సాధ్యమైంది.

1910లో సిడ్నీలో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా సాధించిన 494 పరుగులే ఇప్పటివరకూ టెస్టుల్లో తొలి రోజు అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది.. ఒక రోజులో 500 కంటే ఎక్కువ పరుగులు కేవలం నాలుగు ఇతర సందర్భాలలో మాత్రమే సాధించబడ్డాయి. మూడు సార్లు ఇంగ్లాండ్ మరియు ఒకసారి శ్రీలంక ఈ ఘనత సాధించింది. కానీ ఒక టెస్ట్ ప్రారంభ రోజున ఇంతటి స్కోరు ఏ జట్టు సాధించలేదు. అది కేవలం ఇంగ్లండ్ కే దక్కింది. 1936లో భారత్‌తో జరిగిన టెస్టు రెండో రోజున ఇంగ్లండ్ 588 పరుగులు చేయడం రికార్డుగా ఉంది. ఇప్పుడు కూడా ఇంగ్లండే ఈ రికార్డు సాధించడం విశేషం.