Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను తప్పించింది. భారత్‌లో ఆడడాని నిరాకరించిన కారణంగా బంగ్లాదేశ్‌కు ఐసీసీ పలుమార్లు నచ్చజెప్పింది. ఆధారాలు లేకుండా భద్రత లేదని చెప్పడం సరదికాదని తెలిపింది. అయినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆడేందుకు అంగీకరించలేదు. వేదికలు మార్చాలని కోరింది. కానీ చివరి దశలో వేదిక మార్చడ కుదరదని చెప్పిన ఐసీసీ బంగ్లాదేశ్‌ను టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించి షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది.
పీసీబీ చైర్మన్ అసహనం..
బంగ్లాదేశ్‌ను టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించడంపై ఐసీసీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్(పీసీబీ) నఖ్వీ తప్పు పట్టారు. ‘బంగ్లా ఐసీసీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది, కానీ వారిని దెచ్చుకున్నారు. ఇటీవలి సమావేశంలోనూ ఇదే నా వాదన‘ అని అతను చెప్పాడు. భారత్‌కు బంగ్లా జట్టు వెళ్లకూడదనే నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయని, ఒకే దేశం అన్నీ ఆదేశాలు జారీ చేస్తోందని ప్రశ్నించాడు. భారత్–పాక్ కోసం ఐసీసీ వేదికలు మార్చినట్లు బంగ్లాదేశ్ కోసం ఎందుకు చేయలేదని అడిగాడు.
బంగ్లాదేశ్ బాటలో పాకిస్తాన్..
పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనాలా లేదా అనే నిర్ణయం తీసుకోమని పాక్ ప్రభుత్వాన్ని నఖ్వి కోరాడు. దీనితో పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈమేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే పాకిస్తాన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.