Venkatesh And Ravi Teja: టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్ కి ఆడియన్స్ నుండి మంచి డిమాండ్ ఉంది. ఈ కాంబినేషన్ సినిమాలకు ఆడియన్స్ నుండి టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు కూడా వస్తున్నాయి. అందుకు రీసెంట్ ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ మహారాజ రవితేజ, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టార్రర్ చిత్రం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్ అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ఆయన వెంకటేష్ తో త్వరలోనే ఒక సినిమా చేయబోతున్నాడు, అది సంక్రాంతికి వస్తుంది, అందులో రానా దగ్గుబాటి కూడా ఉంటాడు అనేది వాస్తవం. ఆ సినిమా గురించి పక్కన పెడితే ఇప్పుడు రవితేజ, వెంకటేష్ మల్టీస్టార్రర్ చిత్రాన్ని మాత్రం తెరకెక్కించబోతున్నది శ్రీను వైట్ల అట.
గతంలో రవితేజ తో ఆయన వెంకీ, దుబాయ్ శ్రీను వంటి సినిమాలు తీసి భారీ హిట్స్ ని అందుకున్నాడు. ఇప్పటికీ ఈ సినిమాలను మనం బోరు కొట్టినప్పుడల్లా యూట్యూబ్ లో చూస్తుంటాము. అదే విధంగా వెంకటేష్ తో శ్రీను వైట్ల గతం లో నమో వెంకటేశ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వలేదు కానీ, కామెడీ పరంగా మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ప్రస్తుతం శ్రీను వైట్ల ఒకప్పటి రేంజ్ ఫామ్ లో లేడు. కానీ కామెడీ టైమింగ్ పీక్ రేంజ్ లో ఉన్న ఈ ఇద్దరి హీరోలతో సినిమా చేస్తున్నాడు కాబట్టి , ఒక డీసెంట్ స్టోరీ లైన్ ఉన్నా చాలు, అది వేరే లెవెల్ లోకి తీసుకెళ్లగలిగే సత్తా ఈ ఇద్దరి హీరోల్లోనూ ఉంది. కాబట్టి కచ్చితంగా ఈ సినిమా వర్కౌట్ అవుతుందనే చెప్పాలి. వెంకటేష్ వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు.
రవితేజ కి మాత్రం వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. కానీ ఆయన భవిష్యత్తులో సెట్ చేసుకుంటున్న సినిమాలను చూస్తే కచ్చితంగా మళ్లీ భారీ కం బ్యాక్ ఇవ్వగలడు అనిపిస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభం లో కానీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.