Shehbaz Sharif: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. మరో 10 రోజుల్లో టోర్నీ ప్రారంభమవుతుంది. టెస్టు క్రికెట్ ఆడే 8 జట్లు ఇందులో తలపడనున్నాయి. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. భారత్ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్(Dubai) వేదికగా జరుగనున్నాయి. దీంతో ఇక క్రికెట్ అభిమానుల దృష్టంతా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది. ఇక ఆతిథ్య పాకిస్తాన్ మాత్రం ఈసారి టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఎలాగైనా ఈసారి సొంతగడ్డపై ట్రోఫీ కొట్టాలన్న పట్టుదలతో ఉంది. ఇక ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్(Shehbaz Sharif) కూడా టోర్నీకి ముందు పాక్ జట్టుకు కీకల సూచనలు, దిశానిర్దేశం చేశారు. టోర్నీ గెలవడం ఒక ఎత్తు అయితే.. బారత్‌ను ఓడించడం మరో ఎత్తు అన్నారు. ఈసారి టీమిండియా(Team Indian)ను కచ్చితంగా ఓడించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ సేనను ఓడించడమే తన టార్గెట్ అని చెచ్చగొట్టారు.
భారత్‌ను ఓడించాల్సిందే!
ఛాంపియన్స్ ట్రోఫీ కప్పును సొంతం చేసుకుంటే సరిపోదని, చిరకాల ప్రత్యర్థి టీమిండియాను ఈ టోర్నీలో పాక్ ఓడించాలని ప్రధాని షరీఫ్ సూచించారు. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా రెండు జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో షరీఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ టీం చాలా బలంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల చాలా బాగా ఆడుతుందని పేర్కొన్నారు. కానీ, రెండు రోజుల క్రితం సొంత గడ్డపై న్యూజిలాండ్(NewZiland)చేతులో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని మర్చిపోయినట్లు ఉన్నారు.
గతాన్ని మరిచారా?
సొంత గడ్డపై పాకిస్తాన్ ప్రదర్శనను మర్చిపోయిన ఆ దేశ ప్రధాని షరీఫ్ తమకు కప్పు కన్నా భారత్‌ను ఓడించడమే ముఖ్యం అన్నట్లు వ్యాఖ్యలు చేయడంపై దుమారం రేగుతోంది. ఇంత ఓవరాక్షన్ అవసరమా అని నెటిజన్లు ఇచ్చి పడేస్తున్నారు. 2021 టీ20 సిరీస్‌లో తప్పితే పాక్ ఆడిన ఐసీస ఈటోర్నీలన్నింటిలో టీమిండియా చేతిలో ఓడింది. 2024 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాను ఓడించిన విషయం షరీఫ్ గుర్తు చేశారు. కానీ, అంతకు ముందు ఓడిన విషయాన్ని మర్చిపోయారా అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. చరిత్ర మరిచారా అని ప్రశ్నిస్తున్నారు. ఎంత రెచ్చగొడితే అంత ఘోరంగా పాకిస్తాన్ ఓడిపోతుందని టీమిండియా అభిమానులు సూచిస్తున్నారు.