https://oktelugu.com/

ఒలింపిక్స్ కల చెదిరే: సెమీస్ లో సింధూ ఓటమి

ఒలింపిక్స్ లో భారత్ కు ఖచ్చితంగా పతకం అందిస్తుందని కలలుగన్న భారతీయులకు ఇది షాకింగ్ న్యూస్. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన సెమీ ఫైనల్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీసింధు ఓటమిపాలైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్ చేతిలో మన పీవీ సింధు 18-21, 12-21 తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకబడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తైజు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 31, 2021 / 05:39 PM IST
    Follow us on

    ఒలింపిక్స్ లో భారత్ కు ఖచ్చితంగా పతకం అందిస్తుందని కలలుగన్న భారతీయులకు ఇది షాకింగ్ న్యూస్. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన సెమీ ఫైనల్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీసింధు ఓటమిపాలైంది.

    చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్ చేతిలో మన పీవీ సింధు 18-21, 12-21 తేడాతో ఓటమి పాలైంది.

    మ్యాచ్ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకబడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తైజు తర్వాత సింధూకు గట్టి పోటీనిచ్చింది.దాంతో తొలి గేమ్ లో సింధూ ఓటమిపాలైంది. ఇక రెండో గేమ్ లోనూ మరింత పట్టుదలగా ఆడిన తైజు.. మన సింధూకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో రెండు వరుస గేమ్స్ లో పీవీ సింధూ ఓటమి పాలైంది.

    ఈ మ్యాచ్ లో ఓడిపోయినా సింధు పతకం సాధించేందుకు మరో అవకాశం ఉంది. మరో సెమీ ఫైనల్ లో ఓటమిపాలైన చైనా క్రీడాకారిణి హి బింగ్ జియావోతో ఆదివారం సాయంత్రం తలపడనుంది. అక్కడ గెలిస్తే కాంస్య పతకం సాధించే అవకాశం ఉంది.

    2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో ఈ స్టార్ షట్లర్ రజతం గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మరో పతకం సాధించలేదు.