Ind Vs Eng 1st Test: భారత బౌలర్లపై ఒలీ పోప్ రివర్స్ స్వీప్.. క్రిటిక్స్ ఏమన్నారంటే..?

రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో పోప్ కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ చాలా కన్సిస్టెంట్ గా ఆడుతూ అశ్విన్ బౌలింగ్ లో నిదానంగా ఆడుతూనే మిగిలిన వాళ్ళ బౌలింగ్ లో పరుగులు రాబడుతు ఎక్కువసేపు క్రిజ్ లో ఉండడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు.

Written By: Gopi, Updated On : January 28, 2024 6:33 pm
Follow us on

Ind Vs Eng 1st Test: ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ అందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. కానీ ‘ఒల్లి పోప్’ ఒక్కడే ఒంటిచేత్తో ఒంటరి పోరాటం చేశాడనే చెప్పాలి. ఒక దశ లో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 200 పరుగులు కూడా చేయలేదని అందరూ అనుకున్నారు. కానీ ఆ టీమ్ స్కోర్ ను 420 పరుగుల దాకా తీసుకెళ్లాడు అంటే అది ఒక పోప్ వల్లే సాధ్యమైంది. ఇక పోప్ ఈ మ్యాచ్ లో 196 పరుగులు చేసి బుమ్ర బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. నిజానికి డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నప్పటికీ ఆ మైలురాయి ని మాత్రం దాటలేకపోయాడు.

ఇక ఆయన బ్యాటింగ్ ని చూసిన ఇండియన్ దిగ్గజ ప్లేయర్ అలాగే ఇండియన్ క్రికెట్ గాడ్ గా పిలవబడే మాస్టర్ బ్లాస్టర్ ‘సచిన్ టెండూల్కర్’ పోప్ ఆట పైన స్పందిస్తూ ‘ఆయన ఆటని ఒకప్పటి ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్ మెన్ అయిన ఇయాన్ బెల్ తో పోల్చాడు’. పోప్ ఆడిన షాట్స్ గాని, ఆయన అనుకరించిన విధానం గానీ బెల్ ని పోలి ఉన్నాయి. ఇక ఈ యువ ప్లేయర్ ఇంగ్లాండ్ టీం కి మరింత సేవలు అందించడానికి రెడీ అయ్యాడు అంటూ సచిన్ పోస్ట్ చేశాడు.

ఇక రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో పోప్ కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ చాలా కన్సిస్టెంట్ గా ఆడుతూ అశ్విన్ బౌలింగ్ లో నిదానంగా ఆడుతూనే మిగిలిన వాళ్ళ బౌలింగ్ లో పరుగులు రాబడుతు ఎక్కువసేపు క్రిజ్ లో ఉండడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు.ఇక దాంతో ఇంగ్లాండ్ భారీ పరుగులు చేయగలిగింది.అందుకే ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎవరు రానించకపోయిన ఒక్కడే ఆ టీమ్ బ్యాటింగ్ భారం మొత్తం మోశాడు అంటూ పోస్ట్ చేశాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసింది. అలాగే ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 436 పరుగులు చేసింది ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 420 పరుగులు చేయగా ఇండియా ముందు 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది…