ODI World Cup 2023- Semis :వరల్డ్ కప్ లో భాగంగా సెమీస్ లో ఇండియన్ టీం తో పోటీపడే టీం ఏది అనే దాని మీద ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇక న్యూజిలాండ్ శ్రీలంక మీద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న తర్వాత లెక్కలు మొత్తం మారిపోయాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ టీం నెంబర్ 4 ప్లేస్ లో సెమీఫైనల్ కి ఆల్మోస్ట్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.ఇక అందులో భాగంగానే ఒకవేళ పాకిస్తాన్ టీం గనక సెమీఫైనల్ లోకి రావాలి అంటే తను ఇంగ్లాండ్ మీద ఆడబోయే మ్యాచ్ లో భారీ విజయాన్ని అందుకోవాలి…
ఆ విజయం ఎలా ఉండాలి అంటే ఇంగ్లాండ్ మీద దాదాపు 274 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ మ్యాచ్ గెలవాలి సాధ్యమైనంత వరకు ఇలా గెలవడం చాలా కష్టం ఎందుకంటే ఒక టీం ఎన్ని పరుగులు చేసిన దాదాపు 300 పరుగులు లేదంటే 350 పరుగులు మాత్రమే చేస్తుంది అందులో 274 పరుగుల భారీ తేడాతో గెలవాలంటే అది చాలా రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి అది మాక్సిమం జరగకపోవచ్చు. ఒక విధంగా పాకిస్తాన్ టీం సెమీఫైనల్ లోకి రాకపోతే మాత్రం న్యూజిలాండ్ టీం సెమీఫైనల్ లోకి అడుగుపెడుతుంది. ఈ టోర్నీ కి ముందు పాకిస్తాన్ టీం మేము సెమీస్ లోకి అడుగుపెడుతున్నాం మిగిలిన మూడు జట్లు ఏవో తేలాల్సి ఉంది అనే కామెంట్లు చేశారు.కానీ కట్ చేస్తే ఇప్పుడు టూర్ నుంచి వెనుదిరిగాల్సి వస్తుంది.
ఇక ఎప్పుడు ఇంకేం మాటలు చెబుతారు చూడాలి. పాకిస్తాన్ టీం లో ప్లేయర్ల మధ్య కోఆర్డినేషన్ సరిగా లేకపోయినప్పటికీ వాళ్ల మాటలు మాత్రం కోటలను దాటేలా మాట్లాడుతుంటారు. ఒకరకంగా వాళ్ల టీం మీద ప్రపంచం మొత్తానికి నెగిటివిటీ స్ప్రెడ్ కావడానికి వాళ్ళ మాటలే కారణం ఎందుకంటే వాళ్లు ఎక్కువ ప్రగల్బాలను పలుకుతూ మ్యాచ్ లు ఆడేటప్పుడు మాత్రం చతికిల పడిపోతూ ఉంటారు. ఇక చిన్న జట్ల మీద విజయాలను సాధిస్తూ మాకు మేమే పోటీ మాతో మాకే పోటీ అన్న రేంజ్ లో ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ తీరా బలమైన జట్టు తో బరిలోకి దిగితే మాత్రం చతికిలబడిపోతారు…
ఇక ఇండియాతో సెమీఫైనల్ లో తలపడాలి అన్న వాళ్ళ కల కలగానే మిగిలిపోయింది. పాకిస్తాన్ టీం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే 99% సెమీ ఫైనల్ ల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ టీం సెమీస్ ఫైనల్ కి వచ్చే అవకాశం అయితే లేదు…