https://oktelugu.com/

ODI World Cup 2023 : సూర్య కుమార్ యాదవ్ కంటే ఆ అల్ రౌండర్ ని తీసుకుంటే బాగుండేదా..?

కనీసం ఈ మ్యాచ్ లో అయినా కొడతాడేమో అనుకుంటే ఇంత దారుణమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు ఇలా అందరూ ఫెయిల్ అయినపుడు టీమ్ ని ఆదుకుంటేనే వాళ్ల వాల్యూ ఏంటనేది అందరికీ తెలుస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2023 8:55 pm
    Follow us on

    ODI World Cup 2023 : వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియన్ టీం మొదట బ్యాటింగ్ చేసి దారుణంగా ఫేయిల్ అయింది.ఇక ఇందులో భాగంగానే నిర్ణీత 50 ఓవర్లకి ఇండియన్ టీమ్ 240 పరుగులు చెయ్యడం అనేది నిజంగా ఇండియన్ అభిమానులు జీర్ణించుకోలేని విషయం… ఇండియన్ టీమ్ నుంచి ఫైనల్ లో ఇంత తక్కువ స్కోర్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.300 ప్లస్ స్కోర్ ఎక్స్ పెక్ట్ చేస్తే ఇండియన్ టీం మాత్రం ఈ రేంజ్ లో నిరుత్సాహ పరచడం దారుణం అంటూ అభిమానులు వాపోతున్నారు. బ్యాట్స్ మెన్స్ అందరూ కూడా దారుణంగా ఫెలయ్యారు. రోహిత్ శర్మ , కోహ్లీ,రాహుల్ లని మినహాయిస్తే మిగతా వారు ఎవరు కూడా అంత పెద్ద ప్రభావం చూపించకపోవడంతో ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో చాలా తక్కువ పరుగులు చేయాల్సి వచ్చింది.ఇక ఇంత పెద్ద ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీం ఇలా అభిమానులను నిరుత్సాహ పరచడం ప్రతి ఇండియన్ అభిమాని జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి…

    ఇక ప్లేయర్లందరు ఫెయిల్ అయినా కూడా చివరలో సూర్య కుమార్ యాదవ్ ఎంతో కొంత స్కోర్ కొడతాడు అనే హోప్ అయితే అందరికీ కలిగింది. కానీ ప్రతి మ్యాచ్ లో ఫెయిల్ అయినట్టుగానే ఈ మ్యాచ్ లో కూడా సూర్య దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఒక్క పరుగు చేయడానికి నానా తంటాలు పడ్డాడు.సూర్య కంటే కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ లు చాలా వరకు బెటర్ అనిపించేలా ఆడారు…

    ప్రతి మ్యాచ్ లో ఫెయిల్ అవుతున్న సూర్య కుమార్ యాదవ్ ని ఎందుకు టీంలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిజానికి మెయిన్ ప్లేయర్లు అందరూ ఫెయిల్ అయినప్పుడు హిట్టింగ్ చేయాల్సిన ప్లేయర్ అయిన సూర్య ఏ మాత్రం ప్రభావం చూపించకుండా చాలా దరిద్రంగా మ్యాచ్ ని ఆడడనే చెప్పాలి.ఇక ఆయన బ్యాటింగ్ చూసిన ప్రతి అభిమాని కూడా ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి బీసీసీఐ కూడా హార్దిక్ పాండ్యా రూల్డ్ అవుట్ అయినప్పుడు అతని ప్లేస్ లో మరోక అల్ రౌండర్ ని తీసుకురావాలి గాని అసలు టీమ్ లోకి అవసరం లేని ప్రసిద్ధి కృష్ణని ఎందుకు సెలెక్ట్ చేశారో కూడా తెలియదు.

    ప్రసిద్ధి కృష్ణ కంటే శివం దూబే ను టీం లోకి తీసుకొచ్చి ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే దూబే టీమ్ లోకి వస్తే సూర్య కుమార్ యాదవ్ ని పక్కన పెట్టి దూబేని ఆడిస్తే దూబే చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగలడు ఆయన చాలా పొటెన్షియల్టీ ఉన్న ప్లేయర్. ముఖ్యంగా హార్డ్ హీట్టింగ్ చేస్తాడు. అంతే తప్ప సూర్యలా తడబడుతు మాత్రం అసలు ఆడడు ఒక ఆ రౌండర్ ప్లేస్ లో ఒక పేస్ బౌలర్ ని తీసుకొచ్చి బిసిసిఐ పెద్ద తప్పు చేసింది. ఇక సూర్యకి ప్రతి మ్యాచ్ లో అవకాశం ఇస్తున్నందుకు రోహిత్ శర్మని గాని, కోచ్ రాహుల్ ద్రావిడ్ ను గాని విమర్శించాల్సిన సమయం కూడా వచ్చింది. ఎందుకు అంటే సూర్య ఒక్క ఇన్నింగ్స్ ని మినహాయిస్తే మిగతా ఏ మ్యాచ్ లో కూడా తనదైన రీతిలో పర్ఫామెన్స్ ఇవ్వలేదు..

    కనీసం ఈ మ్యాచ్ లో అయినా కొడతాడేమో అనుకుంటే ఇంత దారుణమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు ఇలా అందరూ ఫెయిల్ అయినపుడు టీమ్ ని ఆదుకుంటేనే వాళ్ల వాల్యూ ఏంటనేది అందరికీ తెలుస్తుంది. కానీ ఇలా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఫెయిల్ అయితే ఇక టీమ్ లో ఎప్పుడు వీళ్ళు సరిగ్గా ఆడేది ఇన్ని సార్లు ఫెయిల్ అయిన సూర్య ని ఎందుకు టీం లో ఉంచుతున్నారు అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చగా మారింది…