Homeక్రీడలుOdi World Cup 2023: తిట్టిపోస్తున్నారు.. గెలిచినా ఓడినా పాకిస్తాన్ పరువే పోతోంది...

Odi World Cup 2023: తిట్టిపోస్తున్నారు.. గెలిచినా ఓడినా పాకిస్తాన్ పరువే పోతోంది…

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ , శ్రీలంక టీం ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ టీమ్ ప్లేయర్ అయిన మహమ్మద్ రిజ్వాన్ పాకిస్థాన్ కి అదిరిపోయే విజయాన్ని అందించాడు. ఇక ఈ క్రమంలో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఆడేటప్పుడు శ్రీలంక నిర్దేశించిన టార్గెట్ ని చేదించే టైంలో మహ్మద్ రిజ్వాన్ తన తల నొప్పి వచ్చినట్టు, కాళ్లు పట్టినట్టు,నరాలు లాగినట్టు, నడవలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మ్యాచ్ కి కొద్దిసేపు బ్రేక్ ని ఇచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలో నిజంగానే ఆయనకి చాలా ఇబ్బంది ఉందేమో అని అందరూ అనుకున్నారు. కానీ మ్యాచ్ అనంతరం మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ తనకి ఏ రకమైన నొప్పి లేదు,తల నొప్పి లేదు, కండరాలు పట్టలేదు, అంత పెద్ద టార్గెట్ ని రీచ్ చేసేటప్పుడు కొంచెం బ్రేక్ కావాల్సి వచ్చింది.అందుకోసం అని బ్రేక్ అడిగితే ఎవరూ ఇవ్వరు కాబట్టి నేనే అలాగా నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు గా,కండరాలు పట్టినట్టుగా యాక్టింగ్ చేసి అలా మ్యాచ్ ని కొద్దిసేపు ఆపాను.

దానివల్ల నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను అంటూ చాలా ఈజీగా చెప్పాడు. దాంతో ప్రపంచ క్రికెట్ లో తను ఒక బ్యాడ్ క్రికెటర్ గా ముద్రపడడమే కాకుండా ఐసీసీ కూడా అతని మీద సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక సిరియస్ మ్యాచ్ జరిగేటప్పుడు ఇలా ఫన్నీ గా చేసి మ్యాచ్ ఆపడం అంటే అదేమన్నా గల్లి క్రికెట్ మ్యాచ్ అని అనుకుంటున్నావా రిజ్వాన్ అని చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.అలాగే మరి కొందరు మీ పాకిస్థాన్ ప్లేయర్లు అంత చీటర్లు ఎవరు ఉండరు అందుకే మీరు చాలా మ్యాచుల్లో ఓడిపోతున్నారు. మీలాంటి వాళ్ళని క్రికెట్ అడనివ్వడం ఐసీసీ చేస్తున్న పెద్ద తప్పు అంటూ చాలా మంది పాకిస్థాన్ టీమ్ మీద నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఇలా మ్యాచ్ గెలిచి కూడా పాకిస్థాన్ టీమ్ అందరి చేత తిట్లు తింటుంది. ఇక ఇదిలా ఉంటే మొన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో పసికూన అయిన ఆఫ్ఘనిస్తాన్ టీం పాకిస్థాన్ టీమ్ ని చిత్తుచేసి మంచి విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ టీమ్ ని చిత్తు చిత్తు గా ఓడించిన ఆఫ్గనిస్తాన్ టీం మ్యాచ్ అనంతరం ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్ మెన్స్ అయిన ఇబ్రహీం జాద్రాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తీసుకుంటూ ఈ విజయాన్ని పాకిస్తానీ నుంచి వెనక్కి పంపబడిన 52,000 మంది ఆఫ్ఘనిస్తాన్ జనాలకి నా ఈ విజయం అంకితం చేస్తున్నాను అంటూ ఒక ఎమోషనల్ కామెంట్ చేశాడు. అయితే ఆఫ్గనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఉన్న అఫ్గాన్ జనాలకి ్కఇక్కడ ఎలా బతకాలో తెలియక అక్కడి నుంచి పాకిస్తాన్ కి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకున్నారు.

ఇక పాకిస్థాన్ గవర్నమెంట్ మా దేశం వాళ్ళు తప్ప ఇక్కడ మిగిలిన దేశాల వాళ్ళు ఎవరు కూడా మా దేశంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి పాకిస్తాన్ నుంచి ఆఫ్గనిస్తాన్ ప్రజలను బలవంతంగా వాళ్ల దేశానికి పంపించడం జరిగింది.ఇక ఇలాంటి క్రమంలో జాద్రాన్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రపంచ దేశాలను సైతం తీవ్రమైన ఎమోషన్ కి గురిచేసింది. దాంతో పాకిస్తాన్ టీం ల మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ పాకిస్తాన్ ని చాలా మంది తిడుతున్నారు. ఎందుకంటే ప్రాణం కాపాడుకోవడానికి దేశానికి వచ్చిన వాళ్ళని అలా బలవంతం గా పంపించడం పాకిస్తాన్ దేశం యొక్క మూర్ఖపు ఆలోచనకి ఉదాహరణ అంటూ ప్రపంచ దేశలు పాకిస్థాన్ మీద నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు…ఇక ఈ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ మ్యాచ్ లు గెలిచిన, ఓడిపోయిన ప్రతి సిచువేషన్ లో కూడా పాకిస్తాన్ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటుంది…

-పాక్ ఆటతీరుపై మాజీల నిప్పులు

పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్లు అయిన వసీం అక్రమ్ లాంటి వాళ్ళు ఇప్పటికే పాకిస్తాన్ టీమ్ అన్ని విభాగాల్లో వరుసగా పేలవమైన పర్ఫామెన్స్ ని ఇస్తుంది.ఇక అందులో భాగంగానే వాళ్ళు ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.ఇప్పటికీ మూడు నెలల నుంచి అసలు ఒక ప్లేయర్ కూడా ఫిట్ గా లేడు, ఫిట్నెస్ టెస్ట్ లో పాల్గొని దాదాపు రెండు నెలల పైన అవుతుంది ఇప్పటికి ఏ ఏ ప్లేయర్ ఫైట్ గా ఉన్నాడో, లేదో నేను చెప్పగలను కానీ ఆ ప్లేయర్లు సిగ్గుతో తల దించుకోవాలి వస్తుంది.బ్యాటింగ్ లో, బౌలింగ్ లో ,ఫీల్డింగ్ లో వరుసగా ఫెయిల్ అవుతున్నారు అంటూ పాకిస్థాన్ టీమ్ ఫెయిల్యూర్ మీద కామెంట్ చేశాడు. ఇక అందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ టీం మీద 282 పరుగులు చేసి కూడా ఆఫ్గనిస్తాన్ టీం లాంటి ఒక పసికూనని ఓడించడంలో కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయిన పాకిస్తాన్ టీమ్ ను చూస్తే నాకు నవ్వాలా, ఏడవాలా అనేది అర్థం కావట్లేదు అంటూ ఘాటుగా పాకిస్తాన్ టీం ని విమర్శించాడు.ఇక మీరు వరల్డ్ కప్ లో ఆడాల్సిన పనిలేదు అందరూ కలిసి ఇంటికి వచ్చేయండి అంటూ కూడా కామెంట్ చేశాడు.

రోజురోజుకీ పాకిస్తాన్ టీమ్ పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతుంది అంటూ అన్నారు. ఇండియన్ టీం మీద పాకిస్తాన్ టీమ్ ఓడిపోయిన సందర్భంలో ఆ టీమ్ మాజీ బౌలర్ అయిన షోయాబ్ అక్తర్ ఇండియన్ టీమ్ ఎంత బాగా ఆడుతుంది మీరు ఎలా ఆడుతున్నారు అంటూ పాకిస్తాన్ టీం మీద విమర్శలు చేశాడు. అలాగే ఒకసారి ఇండియన్ టీం ని చూసి ఆట ఎలా ఆడాలో నేర్చుకోండి అంటూ పాకిస్థాన్ టీమ్ మీద ఘాట్ వ్యాఖ్యలు చేశాడు…ఇక అలాగే మరో పాక్ మాజీ ప్లేయర్ అయిన షోయబ్ మాలిక్ కూడా బాబర్ అజమ్ కెప్టెన్ గా పనికి రాడు అంటూ బాబర్ అజమ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular