Odi World Cup 2023: 2003 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియన్ టీం దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమికి కారణం మన ప్లేయర్లు సరైన పర్ఫామెన్స్ ఇవ్వకపోవడమే అనేది ఆ మ్యాచ్ లో చాలా స్పష్టంగా కనిపించింది. ఇక దానికి తోడుగా ఆస్ట్రేలియా ప్లేయర్లు అందరూ కూడా టీమ్ లో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ ఇండియన్ టీం కి ముఖ్యంగా బ్యాటింగ్ లో అయితే వరల్డ్ కప్ ఫైనల్లో ఎప్పుడూ నమోదు చేయని స్కోర్ ని వాళ్ళు నమోదు చేసి ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశారు.
అప్పట్లో వన్డే మ్యాచ్ లో 300 పరుగులు చేయడం అంటేనే గగనం అలాంటిది వాళ్లు 359 పరుగులు చేశారు అంటే అప్పుడు వాళ్ళ బ్యాటింగ్ స్టాండర్డ్ ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న అత్యంత పెద్ద జట్లు సైతం ఆస్ట్రేలియా టీం ను చూసి భయపడిపోయే రోజులవి ముఖ్యంగా ఆడమ్ గిల్ క్రిస్ట్, మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్, డేనియల్ మార్టిన్, అండ్రు సైమాన్స్, మైఖేల్ బేవన్, డారన్ లీమన్, గ్లెన్ మెగ్రత్,బ్రెట్ లీ, ఆండ్రూ బికెల్ లాంటి టాప్ క్లాస్ ప్లేయర్లతో అప్పటి ఆస్ట్రేలియన్ టీం అద్భుతంగా ఉండేది. అందుకే అప్పట్లో ఆస్ట్రేలియా టీం వరుసగా అన్ని విజయాలను దక్కించుకుంటూ అన్ని టీముల మీద ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చింది. ఇక ఇలాంటి స్టార్ ప్లేయర్లు ఆస్ట్రేలియన్ టీం నుంచి రిటైర్ అయిన తర్వాత ఆస్ట్రేలియా జోరు అనేది కొద్ది వరకు తగ్గింది. ఇక మళ్లీ 2015 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ ని ఓడించి కప్పు కొట్టి మరోసారి వాళ్లు విశ్వ విజేతలుగా నిలిచారు…
ఇక 2003 వ సంవత్సరంలో ఇండియన్ టీం వరల్డ్ కప్ టోర్నీ లో మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి చాలా విమర్శలను ఎదుర్కొంది. ఇక ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకుంటూ ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్ కైతే చేరుకుంది, కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియన్ టీం తో తలపడుతున్నాం అని తెలిసినప్పుడే ఇండియన్ టీం లో చాలా వరకు భయాలు అలుముకున్నాయి. దాంతో మన భయమే మనల్ని ఓడించింది అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం అవసరం లేదు. ఇక ఈ మ్యాచ్ లో 360 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియన్ టీం సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ ప్లేయర్ని కోల్పోవడంతో ఇక ఈ మ్యాచ్ మీద అందరూ ఆశలు కోల్పోయారు. ఇక సెహ్వాగ్ ఒక్కడే చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన కూడా మ్యాచ్ ని గెలిపించలేకపోయాడు…
కానీ ఇప్పుడున్న పరిస్థితి లో ఇండియన్ టీమ్ మాత్రం చాలా మంచి ఫామ్ లో ఉంది ఒకప్పుడు ఆస్ట్రేలియా ఎలా ఉండేదో ఇప్పుడు ఇండియన్ టీమ్ అలా తరయారైంది. ఒకప్పుడు ఇండియన్ టీమ్ ఎలా ఉండేది ఇప్పుడుఆస్ట్రేలియా అలా తయారైంది. కాబట్టి ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ ప్లేయర్లను తీవ్ర భయానికి గురి చేస్తుంది…ఇక అందులో భాగంగానే ఈ మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా ను ఓడిస్తే వరుసగా 11 విజయాలు అందుకున్న టీమ్ గా ఆస్ట్రేలియా పక్కన ఇండియన్ టీమ్ కూడా నిలుస్తుంది.
అలాగే ఈసారి కప్పు గెలిస్తే ఇండియన్ టీమ్ మూడుసార్లు కప్పు గెలిచినట్టు అవుతుంది. కాబట్టి అత్యధికంగా వరల్డ్ కప్ లు గెలిచిన టీముల్లో ఆస్ట్రేలియా 5 సార్లు గెలిస్తే దాని తర్వాత ఇండియన్ టీమ్ మూడుసార్లు కప్ గెలిచింది. కాబట్టి ఇండియన్ టీమ్ సెకండ్ పొజిషన్ లో ఉంటుంది…