Homeక్రీడలుOdi World Cup 2023: భారత్ ఊగిపోతోంది....వన్డే వరల్డ్ కప్ సంబరం షురూ...

Odi World Cup 2023: భారత్ ఊగిపోతోంది….వన్డే వరల్డ్ కప్ సంబరం షురూ…

Odi World Cup 2023: ఇండియాలో ఉన్న 140 కోట్ల మందిలో 100 కోట్లకు పైగా జనం క్రికెట్ ను చూస్తూ క్రికెట్ అంటే ఇష్టపడుతూ క్రికెట్ ని ఒక మతం కంటే ఎక్కువగా భావిస్తూ, క్రికెట్ ఆడుతూ ఉంటే,మరి కొంతమంది క్రికెట్ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా క్రికెట్ అంటే ఇండియన్ అభిమానుల జీవితంలో అమ్మానాన్న క్రికెట్ అన్నంతగా మారిపోయింది. అందుకే ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుంది అని తెలిసినప్పటి నుంచి క్రికెట్ అభిమానులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు.

ఇక ఈ వరల్డ్ కప్ కోసం ఇండియా అనే కాదు ప్రపంచ దేశాలు మొత్తం కూడా 1000 కన్నులతో ఎదురుచూస్తున్నారు అలాంటి వరల్డ్ కప్ ఇండియాలో అంగరంగ వైభవంగా మరి కొద్దీ గంటల్లో ప్రారంభం కానుంది.ఇక అందులో భాగంగానే ఈరోజు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీమ్ ల మధ్య ఒక భారీ మ్యాచ్ అనేది అయితే జరగనుంది. మొదటి మ్యాచ్ గా జరగనున్న ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది.అలాగే ఈ రెండు టీమ్ లు కూడా మొదటి మ్యాచ్ లో గెలిచి వరల్డ్ కప్ లో మొదటి గెలుపును సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి.ఇక 2019 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ టీం రన్నరప్ గా నిలిస్తే ,ఇంగ్లాండ్ మాత్రం ఛాంపియన్స్ గా నిలిచి వాళ్ళ ఎంటైర్ క్రికెట్ కెరియర్ లో మొదటిసారి ప్రపంచ కప్ సాధించి పండగ చేసుకుంది…

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిన్న దేశాలు అయినా నెదర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీమ్ లు ఈ వరల్డ్ కప్ లో కనీసం ఒకటి, రెండు మ్యాచ్ లు అయినా గెలవాలని చూస్తున్నాయి.బంగ్లాదేశ్ టీమ్ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు గెలిచి వాళ్ల సత్తా ఎంతో ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది… ఇక సౌత్ ఆఫ్రికా లాంటి టీంలు వాళ్ల కెరియర్ లో ఒక్కసారీ కూడా వరల్డ్ కప్ సాధించలేదు కాబట్టి ఈసారైన వరల్డ్ కప్ కొట్టి వాళ్ల దేశ ప్రజలకి అంకితం ఇవ్వాలని చూస్తుంది. ఇంకా ఇదే టైంలో పాకిస్తాన్ , శ్రీలంక లాంటి టీములు కూడా వరల్డ్ కప్ కొట్టి చాలా సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యం లో ఈసారి వరల్డ్ కప్ ని సాధించి వాళ్ల దేశ క్రికెట్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేయాలని ఆ టీంలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక న్యూజిలాండ్ టీం లాస్ట్ ఇయర్ రన్నరప్ గా నిలిచినప్పటికీ ఈ ఇయర్ మాత్రం పక్కగా కప్పు కొట్టి లాస్ట్ ఇయర్ వాళ్ల అభిమానులకి మిగిలిన అసంతృప్తిని ఈ ఇయర్ వరల్డ్ కప్ సాధించి సంతృప్తి పరచాలని చూస్తున్నారు.

అలాగే ఇండియాలోనే జరుగుతున్న ఈ వరల్డ్ కప్ ట్రోఫీని ఎలాగైనా ఇండియన్ టీమ్ సొంతం చేసుకొని ముచ్చటగా మూడోసారి ట్రోఫీని అందుకున్న టీం గా ఇండియా నిలవాలని చూస్తుంది.ఇక ప్రపంచ చరిత్రలోనే ఇప్పటివరకు ఎక్కువసార్లు వరల్డ్ కప్ గెలిచిన టీం గా ఆస్ట్రేలియా తన పేరిట ఒక భారీ రికార్డ్ ని నమోదు చేసుకోగా, మరోసారి కప్పు కొట్టి ఆ పేరును సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది….ఇక ఇలాంటి భారీ సమరంలో ఎవరు విజయం సాధిస్తారు. ఎవరిపైన ఎవరిది పై చేయి గా నిలుస్తుంది అనే ఒక భారీ సస్పెన్స్ తో కూడుకున్న మ్యాచ్ లకు ఇండియా వేదిక కానున్నందుకు ఇండియన్ అభిమానులు అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇక ఈ వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠను రేపే విధంగా ఉండబోతుంది అనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది…

ఇక ఒకసారి ఈ వరల్డ్ కప్ ఫార్మాట్ ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి ఈ ట్రోఫీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. అందులో లీగ్ మ్యాచ్ ల్లో ఒక్కో టీమ్ 9 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఇక లీగ్ దశ లో టాప్ లో నిలిచిన నాలుగు టీములు మాత్రమే సెమీస్ కి క్వాలిఫై అవుతాయి అలాగే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ లో ఉన్న టీం కి నెంబర్ ఫోర్ లో ఉన్న టీమ్ కి మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్ లో ఉన్న టీం లకి రెండో సెమి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అలా ఈ రెండు మ్యాచ్ ల్లో ఏ టీం లు అయితే విజయం సాధిస్తాయో ఆ రెండు టీమ్ లు ఫైనల్ లో తలపడతాయి. మొత్తానికి అయితే ఈ మ్యాచ్ లు ఎలా జరగాలి అనేదాని మీద ఐసీసీ చాలా క్లారిటీగా ప్రణాళికలను నిర్దేశించింది.ఇక ఏ టీం కప్పు కొడుతుంది అనేది మాత్రం ఇక్కడ అర్థం కావడం లేదు…

ఇక ఇప్పటికి చూసుకుంటే ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీం లు సెమీస్ కి క్వాలిఫై అవుతాయి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక మరొక ప్లేస్ కోసం ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ,పాకిస్తాన్ లాంటి టీంలు పోటీలో ఉండనున్నాయి. ఇక ముఖ్యంగా ఈ ఆరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు మాత్రం చాలా ఉత్కంఠను రేపుతాయి అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular