India Vs New Zealand: వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఇండియా న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడబోతుంది అందులో భాగంగానే ఇండియా టీం లో ఎవరెవరు ప్లేయర్లు ఆడబోతున్నారనే విషయం మీద ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్లేయర్లలో చాలామంది ప్లేయర్లు ప్రస్తుతం అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఇండియన్ టీమ్ లోఆడతాడా లేదా అనే విషయం మీద స్పష్టత లేదు. ఇక దానికి తగ్గట్టుగానే సూర్య కుమార్ యాదవ్ తుది టీంలోకి వస్తాడా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తేనె టీగలు కుట్టిన ఇషాన్ కిషన్ ఆడుతడా లేదా అనేది తెలియాలి , ఇక రవీంద్ర జడేజా కూడా టీమ్ లో ఉంటాడు అనే స్పష్టత అయితే లేదు.ఇక ఇలాంటి క్రమంలో తుది జట్టులో చోటు సంపాదించుకునే ప్లేయర్లు ఎవరు అనేదానిమీద ఇప్పటికైతే ఏ రకంగా చూసిన ఒక స్పష్టత అనేది రావడం లేదు. దాంతో ఇండియన్ టీంలో చోటు సంపాదించుకునే ప్లేయర్లు ఎవరు అనేదానిమీద క్లారిటీ అనేది రావాల్సి ఉంది.
ఇక ఇలాంటి క్రమంలో న్యూజిలాండ్ లాంటి ఒక బలమైన టీం ని ఎదుర్కోవాలి అంటే ఇండియన్ టీం లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్లు ఉండాలి లేకపోతే మాత్రం ఇండియా టీమ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించడం చాలా కష్టమవుతుంది. ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను అందుకున్న ఇండియన్ టీంలో తుది టీంలో ఎవరైతే ఉంటారో వాళ్లే టీం భారం మొత్తాన్ని మోసే అవకాశం ఉంటుంద కాబట్టి వాళ్లు తప్పకుండా ఇండియన్ టీం తరఫున మ్యాచులు గెలిపించే బాధ్యతని కలిగి ఉండాలి అందుకే ప్లేయింగ్ లెవన్ లో ఏ ప్లేయర్ ఉండాలి అనే దానిమీద చర్చ నడుస్తుంది.
ఇంకా ఈ క్రమంలో ఇండియన్ ప్లేయర్లు కూడా గత మ్యాచ్ లో మాదిరి గానే ఈ మ్యాచ్ లో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ లు ఇస్తే తప్ప న్యూజిలాండ్ లాంటి బలమైన టీం ని ఓడించలేం ఇక ఇలాంటి క్రమంలో ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో విజయం కనుక సాధించినట్టయితే ఆ తర్వాత ఇండియన్ టీం ను ఆపే టీం లేదనే చెప్పాలి.ఇక ఇదే మూమెంట్లో గనక ఇండియా ఈ మ్యాచ్ లో గెలిచి దూసుకుపోతే ఇండియన్ టీం కి పక్కాగా వరల్డ్ కప్ వస్తుంది కానీ ఈ మ్యాచ్ గెలవాలి అంటే మాత్రం ఇండియన్ టీం ప్లేయర్లందరూ కూడా కలిసికట్టుగా ఆడాల్సి ఉంది ఈ టీంలో తుది సమరంలో ఏ ప్లేయర్లు ఉంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…