ODI world cup 2023 : వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టీముల మధ్య ఒక భారీ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మీద బంగ్లాదేశ్ విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్ టీం కి వాళ్ల ఓపెనర్లు నుంచి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం వరుసగా వికెట్లను కోల్పోతూ బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి నిలబండలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ లలో గురుబాజ్ 47, ఇబ్రహీం జర్డ్రాన్ 22 పరుగులు చేశారు.వీళ్ళు ఇద్దరు ఆఫ్గనిస్తాన్ టీమ్ కి ఒక చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పారు…
ఇక వీళ్ళు ఔట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రహమత్ 18, కెప్టెన్ శహిది 18 పరుగులు చేశారు… అజుముల్ల 22 పరుగులు చేశారు ఇక వీళ్లని మినహా ఇస్తే ఆఫ్గనిస్తాన్ బ్యాట్స్ మెన్స్ ఎవ్వరూ కూడా పెద్ద స్కోర్ చేయలేక పోయారు..ఇక దానికి తోడు బంగ్లా బౌలర్లు కూడా ఈ మ్యాచ్ లో తమదైన రీతిలో అదరగొట్టడంతో వీళ్ళ దెబ్బ కి ఆఫ్గనిస్తాన్ 156 పరుగులకు ఆల్ ఔట్ అయింది… ఇంకా బంగ్లాదేశ్ బౌలర్లలో షాకిబ్ మూడు వికెట్లు తీయగా మహిడి హసన్ మీరాజ్ మూడు వికెట్లు తీశాడు. ఇక వీళ్లతో పాటుగా ఇస్లాం 2 వికెట్లు, అహ్మద్ , ముస్తఫిజర్ చేరో వికెట్ తీశారు.
ఇక 157 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్స్ లో ఒపెనర్లు అయిన తనిజీద్ హసన్, లింటన్ దాస్ ఇద్దరు కూడా పెద్దగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఇవ్వలేకపోయారు. దాంతో వెనువెంటనే వీళ్లిద్దరు వికెట్లను కోల్పోవడం జరిగింది.ఇక ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మెహిదీ హసన్ మిరాజ్ తనదైనా ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతూ 57 పరుగులు చేశాడు. అలాగే వీళ్లతో పాటు శంటో 59 పరుగులు చేసి ఆఫ్గనిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దాంతో బంగ్లాదేశ్ 34 ఓవర్ 4 బంతులకి 158 పరుగులు చేసి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. దాంతో బంగ్లాదేశ్ వరల్డ్ కప్ లో మొదటి విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వాళ్ళ ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఒక భారీ పరాజయాన్ని మూట కట్టుకున్నారు. ఇక దీంతో ఈ రెండు టీములు కూడా వాళ్ళ మొదటి మ్యాచ్ ని పూర్తి చేసుకున్నారు బంగ్లాదేశ్ మాత్రం ఈ మ్యాచ్ ని ఘన విజయం తో ముగించింది…ఇక ఆల్ రౌండర్ ప్రదర్శన ని కనబర్చిన మహిడీ హాసన్ మిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు….ఈ విజయం తో బంగ్లాదేశ్ పెద్ద టీమ్ లకు సైతం సవాళ్లని విసురుతుంది…