ODI World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ్ల ఆస్ట్రేలియా తో ఇండియా మొదటి మ్యాచ్ ని ఆడబోతుంది.ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ రెండు దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ విపరీతంగా ఉంది. ఈ మ్యాచ్ తోనే మొదటి విజయాన్ని నమోదు చేసుకోవాలని ఇరుజట్లు కూడా ఇప్పటికే ఉవ్విల్లూరుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇక ఇలాంటి టైంలో వరల్డ్ కప్ లో తన సత్తా చాటాలి అని ఆస్ట్రేలియా ఇండియా టీంలు రెండు కూడా ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చుకోవడానికి రెఢీ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్ ను కనక ఒకసారి చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా టీంలో ఏకంగా ముగ్గురు సెంచరీలు చేసి రికార్డ్ సృష్టించారు.క్వింటన్ డికాక్, వాన్‌డెర్ డుస్సెన్, కేప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ సెంచరీలు చేశారు. సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లకి ఐదు వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసింది.దానికి తగ్గట్టు గానే శ్రీలంక కూడా వీళ్ళకి గట్టి పోటీ ఇచ్చింది. 44.5 ఓవర్లల్లో 326 పరుగులకు ఆలౌట్ అయింది…ఇక ఈ వరల్డ్ కప్ ని కనక చూసుకుంటే ఇక మీదట జరిగే మిగతా అన్ని మ్యాచ్ లు కూడా భారీ స్కోరు నమోదు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇవాళ్ల ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు టీంలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ వరల్డ్ కప్ లోనే చాలా రసవత్తరమైన మ్యాచ్ గా తెలుస్తుంది.
ఇక ఇండియా టీంని కనక చూసుకున్నట్లయితే 2011 వరల్డ్ కప్ సమయంలో ఆస్ట్రేలియా మీద ఆడిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, సురేష్ రైనా లాంటి ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు రాణించడంతో వరుసగా మూడుసార్లు వరల్డ్ కప్ గెలిచి వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకున్న ఆస్ట్రేలియా టీం ని ఇండియా ఓడించి ఇంటికి పంపించడం జరిగింది. అలా ఇండియాకి ఆస్ట్రేలియా మీద వరల్డ్ కప్ లో మంచి రికార్డు అయితే ఉంది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కూడా ఈ మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా పై గెలిచి ఆధిపత్యాన్ని చూపించాలని చూస్తుంది…అందుకోసమే మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించి గొప్ప ఆరంభాన్ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.అందుకే ఇండియా టీమ్ చాలా కసరత్తులను కూడా చేస్తుంది. ఇప్పటికే బ్యాటింగ్ స్ట్రాంగ్ గా బరిలోకి దిగుతున్న ఇండియా టీం బౌలింగ్ లోను వండర్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయింది.స్పిన్నర్లుగా అశ్విన్, కుల్దీప్ యాదవ్ లు కూడా ఈ మ్యాచ్ లో అందుబాటులో ఉంటారు.
ఇప్పటికే డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్న శుభ్ మన్ గిల్ టీం లో ఉంటాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. మొన్నటిదాకా ఆయనకి కొంచెం ఫీవర్ సీరియస్ గా ఉంది అని చెప్పినప్పటికీ రీసెంట్ గా రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ ఆయన బాగానే ఉన్నాడు మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడు అనే ఒక మాట చెప్పడంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఆస్ట్రేలియా మీద శుభ్ మన్ గిల్ ఒక కీలకమైన ప్లేయర్ గా మనం చెప్పవచ్చు.అత్యంత నైపుణ్యం ఉండి ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడగలిగి ఎక్కువ రన్స్ చేయడంలో విరాట్ కోహ్లీ తర్వాత గిల్ కి అంత మంచి పేరుంది కాబట్టి లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్లు మనకు కావాలి. అందుకే గిల్ అందుబాటులో ఉంటే మంచిది. ఇక పిచ్ గురించి కనక చూసుకున్నట్లయితే ఈ పిచ్ స్పిన్నర్స్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది.
స్పిన్నర్స్ ఇక్కడ మ్యాజిక్ చేయొచ్చు అలాగే ఇక ఈ మ్యాచ్ కి వర్షం అడ్డంకి కూడా చాలానే ఉంది అన్నట్టుగా తెలుస్తుంది నిన్న చెన్నై లో వర్షం కురిసింది.అయితే ఈ మ్యాచ్ లో డ్యూ ఫ్యాక్టర్ కూడా కీలకంగా మారబోతోంది అనే విషయం తెలుస్తుంది.ఇక క్లౌడ్ కవర్స్ లో ఉంటే పర్లేదు కానీ కొంచెం సూర్యుడు బయటికి వచ్చి కాస్త ఎండ కాస్తే మాత్రం ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ చాలా కీలకంగా మారిపోతుంది అనే విషయమైతే తెలుస్తుంది. ఇక మన బ్యాట్స్ మెన్స్ లో ఇషాన్ కిషన్/శుభ్ మన్ గిల్ , రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ ,శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ,కే ఎల్ రాహుల్ , రవీంద్ర జడేజా,రవి చంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా లు ఈ మ్యాచ్ లో ఇండియా టీమ్ తరుపున బరిలోకి దిగినట్టుగా తెలుస్తుంది… ఇక మన బ్యాట్స్ మెన్స్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ వీళ్ళు ముగ్గురు చాలా కీలక పాత్ర వహిస్తే తప్ప ఈ మ్యాచ్ లో మనం భారీ స్కోర్ చేయలేము… ఇక బోలింగ్ లో అశ్విన్ , జడేజా, కుల్డిప్ ముగ్గురు కూడా కీలకం కాబోతున్నారు.ఇక బుమ్రా, సిరజ్ లు కూడా వాళ్ల ఫాస్ట్ బౌలింగ్ తో వాళ్ల సత్తా ఏంటో మరోసారి చూపించాల్సిన అవకాశం ఉంది…
ఇక ఒకసారి ఆస్ట్రేలియన్ టీంని గనక చూసుకున్నట్లయితే వీళ్ళ టీంలో మాక్స్ వెల్, అడం జంపా ఇద్దరు కూడా బౌలింగ్ సైడ్ ఈ మ్యాచ్ లో కీలకం కాబోతున్నారు.ఎందుకంటే మాక్స్ వెల్ మొన్న జరిగిన మ్యాచ్ లో మ్యాజిక్ చేశాడు.అదేవిధంగా ఇప్పుడు కూడా ఏదైనా మ్యాజిక్ చేయగలిగే సత్తా ఆయనకి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఆయన కీలకం కాబోతున్నాడు.అలాగే ఆడం జంప లెగ్ స్పిన్ లో తనకు తానే సాటిగా వెలుగొందుతున్నాడు. అలాగే మన మీద అతనికి మంచి రికార్డ్ కూడా ఉంది కాబట్టి చాలావరకు ఆయన ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ చూపించబోతున్నాడు.
ఇక బ్యాట్స్ మెన్స్ అయిన వార్నర్ ,మార్ష్ ,స్మిత్, అలెక్స్ క్యారీ లు కూడా భారీ స్కోరు చేయడానికి రెఢీ అవుతున్నారు.ఇక ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే హజిల్ వుడ్, స్టార్క్ , కమిన్స్ ఎంత మంచి బౌలింగ్ చేయగలరో అంతే మంచి బ్యాటింగ్ కూడా చేయగలరు. నెంబర్ 6 , 7 వికెట్లు పోయిన కూడా వాళ్ళు వచ్చి బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాని గెలిపించిన మ్యాచ్ లు చాలా ఉన్నాయి.కాబట్టి మొన్న జరిగిన సీరీస్ లో వాళ్ల మీద గెలిచాం కాబట్టి మనల్ని వాళ్ళు గెలవలేరు అనే ఓవర్ కాన్ఫిడెంట్ ని వదిలేసి మన వాళ్ళు మ్యాచ్ ఆడితే మనకు బెస్ట్ అవుతుంది. వాళ్ళని బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోనూ ఎంత మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ పొరపాటున తక్కువ అంచనా వేసినట్లయితే మాత్రం ఈ మ్యాచ్ మీద మనం ఆశలు వదిలేసుకోవాల్సిందే…