Knee Pain: వాతావరణంలో ఏర్పడిన కాలుష్యంతో పాటు కలుషితమైన నీటిని తీసుకోవడం ద్వారా అనేక రోగాలు వస్తున్నాయి. ఈ కాలంలో చాలా మంది మోకళ్ల నొప్పులతో విపరీతంగా బాధపడుతున్నారు. చిన్న వయసు వారే మోకాళ్ల నొప్పులతో ఆవేదన చెందుతున్నారు. అయితే మొకాళ్ల నొప్పులతో కొందరు రకరకాల మెడిసిన్స్ తీసుకుంటారు. కానీ అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. కొందరు ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటున్నారు. కానీ సైడ్ ఎఫెక్ట్ తో సమస్యలు తెచ్చుకుంటున్నారన్న వార్తలు వింటూనే ఉన్నాం. అయితే కొన్ని పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రకృతిలో దొరికే చాలా ఆహార పదార్థాల్లో అనేక ఔషధాలు ఉంటాయి. కానీ వాటిని అవైడ్ చేయడం వల్ల ఆరోగ్య పదార్థాలను కోల్పోతున్నారు. శరీరంలో యూరిక్ ఆసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి వెల్లుల్లి మంచి ఔషధంలా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వెల్లుల్లిని తీసుకోవడం బెటర్. ఉదయం ఖాళీ కడుపుతో మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బలను నేరుగా తీసుకోవాలి. లేదా వీటికి ఉప్పు, ఇంగువ యాడ్ చేసి తీసుకోవచ్చు.
అల్లంలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అర్థరైటిస్ తో బాధపడేవారు అల్లం తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.శరీరంలో ఉన్న అధిక యూరిక్ యాసిడ్ ను అల్లం తగ్గిస్తుంది. అంతేకాకుండా అల్లం నూనెను మోకాళ్లపై మర్దన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా మోకాళ్ల నొప్పిని మాయం చేస్తుంది. ఇందులో ఉండే ఎసిడిక్ యాసిడ్, పెక్టిన్, మాలిక్ యాసిడ్ శరీరంలోని హానికరమైన పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతాయి.
ఇంట్లో ఉండే వాము తో కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. వాము రెగ్యులర్ గా తీసుకుంటే యారిక్ ఆసిడ్ సమస్య మాయమవుతుంది. వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ తరువాత ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ నీటిని తాగితే మోకాళ్ల నొప్పి మటుమాయం అవుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొదవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.