Homeక్రీడలుక్రికెట్‌Champions Trophy 2025: భారత్ మాత్రమే కాదు.. ఈ దేశాలు కూడా ఐసీసీ మెగా లీగ్...

Champions Trophy 2025: భారత్ మాత్రమే కాదు.. ఈ దేశాలు కూడా ఐసీసీ మెగా లీగ్ లలో ఆడేందుకు ఒప్పుకోలేదు..

Champions Trophy 2025: పాకిస్తాన్ దేశంలో భద్రత సక్రమంగా ఉండదని.. గతంలో ఆటగాళ్లకు ఎదురైన అనుభవాలను వెల్లడిస్తూ భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైతే తమ జట్టు ఆడే మ్యాచ్ లను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని ఐసీసీకి సూచించింది. గతంలో నిర్వహించిన ఆసియా కప్ లాగానే తమ జట్టు ఆడే మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీకి విన్నవించింది..” గతంలో శ్రీలంక జట్టు ఆటగాళ్లపై దాడులు జరిగాయి. వారు వెంట్రుకవాసిలో ప్రాణాలను కాపాడుకున్నారు. లేకుంటే వారు ఎప్పుడో ఉగ్రవాదుల చేతుల్లో చిక్కి కాలగర్భంలో కలిసిపోయే వారు. మా జట్టు ఆటగాళ్ల భద్రత అత్యంత ముఖ్యం. అందువల్లే మేము పాకిస్తాన్ లో ఆడటానికి పంపించబోమని” బిసిసిఐ చెబుతోంది. ఇక గతంలో ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలు ఆడేందుకు నిరాకరించిన జట్లను ఒకసారి పరిశీలిస్తే..

1996 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఆడలేదు

భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు సంయుక్తంగా 1996 వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చాయి. శ్రీలంక 4 గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్, జింబాబ్వే, కెన్యా తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ లకు ముందు జనవరి 31న శ్రీలంక రాజధాని కొలంబో సెంట్రల్ బ్యాంకులో భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 90 మంది చనిపోయారు. 1,400 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు లంకలో ఆడేందుకు ఒప్పుకోలేదు. అయితే తమకు మ్యాచ్ పాయింట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. శ్రీలంక జట్టు ఒప్పుకోలేదు. పాయింట్లు విభజించాలని ఐసీసీ ప్రతిపాదించింది. దీనిని శ్రీలంక క్రికెట్ బోర్డు ఒప్పుకోలేదు. ఇక్కడ మరో దీనిపై ఓటింగ్ నిర్వహించగా ఐసిసి వైపు అందరూ మొగ్గు చూపారు. అప్పటికి శ్రీలంక కూడా ఐసీసీ చెప్పిన విధానానికి ఒప్పుకోలేదు. అయితే తమ దేశంలో ఆడని మ్యాచ్ లకు రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేసి శ్రీలంక ఓటింగ్ కు పట్టు పట్టింది. అయితే ఈసారి ఓటింగ్ లంక విజయం సాధించింది.. రెండు మ్యాచ్ లు లంకలో రద్దు కావడంతో మొత్తం నాలుగు పాయింట్లు సాధించింది.. ఫైనల్ వెళ్లిన శ్రీలంక 1996లో లాహోర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్ సొంతం చేసుకుంది.

2003 ప్రపంచ కప్ లో..

1996 మాదిరిగానే 2003 ప్రపంచ కప్ లోనూ ఇలాంటి సీనే రిపీట్ అయింది. ఆ టోర్నీని దక్షిణాఫ్రికా, కెన్యా, జింబాబ్వే హోస్ట్ చేశాయి. జింబాబ్వేలో ఆ సమయంలో రాజకీయంగా హింస చోటుచేసుకుంది. ఫలితంగా హరారేలో జరగాల్సిన మ్యాచ్ ను ఆడేందుకు ఇంగ్లాండ్ జట్టు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో జింబాబ్వే జట్టు పూర్తి పాయింట్లు సాధించింది. ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా నష్టపోయింది. మొత్తంగా జింబాబ్వే 14 పాయింట్లు దక్కించుకుని సూపర్ సిక్స్ లోకి వెళ్ళింది. ఇంగ్లాండ్ జట్టు కేవలం 12 పాయింట్లతో ఎలిమినేట్ అయింది.

న్యూజిలాండ్ కూడా

ఇదే టోర్నీలో న్యూజిలాండ్ కూడా భద్రత కారణాలను చూసి నైరోబిలో కెన్యాతో మ్యాచ్ ఆడలేదు. దీంతో కెన్యాకు పాయింట్లు లభించి వరల్డ్ కప్ లో సూపర్ సిక్స్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత కెన్యా మరోసారి ఘనత సాధించలేదు.

2009 t20 వరల్డ్ కప్ లో జింబాబ్వే…

2009 ప్రపంచ కప్ ను ఇంగ్లాండ్ జట్టు హోస్ట్ చేసింది. జింబాబ్వే జట్టుకు బ్రిటన్ ప్రభుత్వం వీసాలు ఇవ్వలేదు.. దీంతో జింబాబ్వే ఈ టోర్నీలో ఆడలేదు. ఆ తర్వాత ఐర్లాండ్, నెదర్లాండ్స్ తర్వాత మూడవ సంయుక్త దేశంగా ఉన్న స్కాట్లాండ్ ఈ టోర్నీలో ఆడేందుకు అవకాశం లభించింది .

టోర్నీకి దూరమైంది

1982లో మహిళల ప్రపంచ కప్ ను న్యూజిలాండ్ నిర్వహించింది. అయితే అక్కడికి వెళ్లడానికి వెస్టిండీస్ జట్టు ఒప్పుకోలేదు. అయితే దీని వెనక భద్రత లేదా ఇతర కారణాలు లేవు. వర్ణ వివక్షే ఇక్కడ అసలు సమస్య. 1981లో న్యూజిలాండ్ జట్టు రగ్బీ కోసం దక్షిణాఫ్రికాను తమ దేశానికి ఆహ్వానించింది. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా న్యూజిలాండ్ జట్టు సౌత్ ఆఫ్రికా ను ఆహ్వానించింది. అయితే మరుసటి ఏడాది ఆందోళనకారులకు మద్దతుగా వెస్టిండీస్ న్యూజిలాండ్ లో జరిగే వరల్డ్ కప్ కోసం వెళ్లలేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular