Nitish Kumar Reddy: క్రికెట్ లో కొంతమంది ప్లేయర్లకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అవి వారిని మి మిగతా ప్లేయర్లకు భిన్నంగా ఉంచుతాయి. ఈ జాబితాలో టీమిండియా యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి చేరిపోయాడు. అతడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. స్వయంగా ఈ విషయాన్ని అతడే బయట పెట్టడంతో ఆసక్తికరంగా మారింది…
ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన పెర్త్ వన్డే ద్వారా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రవేశించాడు తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి. హార్థిక్ పాండ్యా గాయపడడంతో తాతడి స్థానంలో ఇతడికి అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం నితీష్ విజయవంతమయ్యాడు. అంతేకాదు పెర్త్ వన్డే ద్వారా అతడు ఒక అద్భుతమైన రికార్డు సృష్టించాడు. 1932 తర్వాత ఒకే వేదిక మీద టెస్ట్, వన్డే క్యాప్ లు అందుకున్న ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. 2024 -25 సీజన్లో అతడు బోర్డర్ గవాస్కర్ సిరీస్ సందర్భంగా పెర్త్ మైదానంలో టెస్టుల్లోకి ప్రవేశించాడు. ఇదే మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. నితీష్ కుమార్ రెడ్డికి మరుపురాని జ్ఞాపకం లాగా మిగిలిపోయింది.
వన్డే లో ప్రవేశించడం ద్వారా నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మూడు ఫార్మాట్లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికైనా తొమ్మిది టెస్టులు ఆడాడు. 4 t20 లలో ప్రాతినిధ్యం వహించాడు. పెర్త్ మైదానంలో వన్డేలలోకి ప్రవేశించడం ద్వారా నితీష్ కుమార్ రెడ్డి తన భావాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. ” ఈ మైదానం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎంతోమంది భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని పోటీపడుతున్నారు. అయితే నాకు అవకాశాలు రావడం గొప్పగా అనిపిస్తుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అంటే మాటలు కాదు. ఆ పదాలు చాలా బరువుగా ఉంటాయి. నాకు అమితమైన గౌరవాన్ని తీసుకొచ్చాయని” నితీష్ పేర్కొన్నాడు.. పెర్త్ వన్డేలో అతడు 19 పరుగులు చేశాడు. తద్వారా టీమిండియా స్కోరును కాస్తలో కాస్త పరుగులు పెట్టించాడు. వాస్తవానికి అతడు గనుక ఇంకా మెరుగైన ఇన్నింగ్స్ ఆడి ఉండి ఉంటే టీమ్ ఇండియా పరిస్థితి మరో విధంగా ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెల్ బోర్న్ మైదానంలో నితీష్ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఆ సెంచరీ అతడి క్రికెట్ గతిని పూర్తిగా మార్చేసింది. అప్పటినుంచి అతడు జట్టులో స్థిరమైన స్థానాన్ని పొందుతున్నాడు. వచ్చిన అవకాశాలను కాస్తలో కాస్త సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఎంతో విలువైన కెరియర్ అతడికి ఉన్న నేపథ్యంలో కెరియర్ ను ఎలా మలచుకుంటాడు, మార్చుకుంటాడు.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని విశ్లేషకులు అంటున్నారు.
View this post on Instagram