Rohit Sharma: టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ శర్మపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విరాట్ కోహ్లి పరాజయాల బాట పట్టడంతోనే రోహిత్ కు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకు ముందు సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మలుచుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తేనే మనుగడ ఉంటుంది. అపజయాలను సైతం చాలెంజ్ గా తీసుకుని విజయాల వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితులు వస్తాయనడంలో సందేహం లేదు. కానీ కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించగల సత్తా ఉండాలి.

టీ 20 ప్రపంచ కప్ లో టీమిండియా ఓటమికి పలు కారణాలున్నా బాధ్యత మాత్రం కోహ్లిపైనే పడింది. ఫలితంగా కెప్టెన్సీ బాధ్యతలు దూరమైనట్లు తెలుస్తోంది. వన్డే జట్టుకు కూడా రోహిత్ ను కెప్టెన్ గా నియమించడంతో అతడిపై గురుతర బాధ్యతలు పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే ప్రపంచ కప్ లో ఇండియాను గెలిపించాల్సిన విధంగా జట్టును కుర్పు చేసుకోవాలి. అందుకు రోహిత్ శ్రమించాల్సిన అవసరం ఏర్పడింది.
టీమిండియాలో ఆటగాళ్లను ఎంపిక చేయడంలో కూడా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సెలెక్టర్లు పైరవీలకు తావివ్వకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తేనే బాగుంటుందని చెబుతున్నారు. దీనిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కొత్త కెప్టెన్ కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా విజయంపై ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయనేది తెలిసిందే.
రోహిత్ శర్మ ఐసీసీ టోర్నోల్లో భారత్ ను విజేతగా నిలిపేందుకు సరైన వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. ఆటగాళ్ల అనుభవంతోపాటు కెప్టెన్ సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి. దీనిపై కెప్టెన్ బాధ్యతగా వ్యవహరించాలి. ఆటగాళ్లను ప్రోత్సహించాలి. విజయంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
Also Read: Virat Kohli: అత్యుత్తమ కెప్టెన్ కోహ్లీకి అవమానమా? బీసీసీఐపై నెటిజన్ల ఫైర్