MegaStar Chiranjeevi : తెలుగు వెండితెరకు స్టెప్స్ ను పరిచయం చేసింది ‘ఏఎన్నార్’ అయినా, ఆ స్టెప్స్ కు గ్లామర్ ను, గ్రామర్ ను తీసుకొచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవినే. నిజంగానే చిరు డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకు చిరు డ్యాన్స్ అంత పాపులర్ అయింది అంటే.. ఏమి చెప్పాలి. అసలు బ్రేకింగ్ డ్యాన్స్ అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే.. మరెవ్వరూ చేయలేని విధంగా డ్యాన్స్ చేస్తే ఎవరికీ మాత్రం ఎందుకు నచ్చదు.

చిరు డ్యాన్స్ లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటి ? ఈజ్. చిరంజీవి డ్యాన్స్ చేస్తే… అది డ్యాన్స్ లా ఉండదు. సహజంగా ఉంటుంది. వేడి వేడి అన్నం పొగలు కక్కుతూ ఉంటే ఓ గుప్పెడు అప్పడాలు వేసుకుని, బాగా మరగబెట్టిన పంపిచారు పోసుకుని.. చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఊదుకుంటూ ఊదుకుంటూ తింటుంటే మదిలో వెయ్యి వీణలు ఒకేసారి మ్రోగినట్టు ఎలా అనిపిస్తోందో.. ఊపు వచ్చే పాటలకు చిరు స్టెప్స్ కూడా అంత గొప్ప కిక్ ను ఇస్తాయి.
చిరంజీవి హీరోగా రాకముందు.. శోభన్ బాబు, కృష్ణ స్టార్ హీరోలుగా ఉండేవారు. వాళ్ళ దృష్టిలో డాన్స్ అంటే.. హీరోయిన్ తో పాటు ఊగుతూ అటూ ఇటూ నాలుగడుగులెయ్యటమే. కాకపోతే, అప్పటికే అద్భుతమైన డాన్సులు చేసిన హీరోయిన్స్ ఉన్నారు. మన హీరోలు ఊగుతూ నడుస్తూ ఉంటే ఆ హీరోయిన్లు ఒళ్ళు విరుచుకుని, అందాలు ఆరబెట్టుకుని తెగ డ్యాన్స్ చేసేవాళ్ళు.

దాంతో డ్యాన్స్ ఉందనే భావన ప్రేక్షకుడికి కలిగేది. ఆ కారణంగా ఆ హీరోలు ఎలాగోలా పాస్ అయిపోయేవారు. కానీ గొప్ప డ్యాన్సర్స్ గా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత, డిస్కో శాంతి లాంటి వాళ్లతో పాటు సమానంగా డాన్సులు చేసిన హీరో అంటే.. అప్పట్లో ఒక్క చిరంజీవినే. అందుకే, చిరు డ్యాన్స్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది.