Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఫామ్ లో లేక సతమతమవుతున్నాడు. దీంతో వెస్టిండీస్ తో జరిగే టూర్ కు అతడిని ఎంపిక చేయలేదు. దీంతో నెటిజన్లు కోహ్లిపై మండిపడుతున్నారు. చెత్త పర్ఫార్మెన్స్ చూపడంతోనే జట్టుకు దూరం కావాల్సి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ టూర్ లో ఒక టెస్ట్, టీ20, వన్డే సిరీస్ లలో కోహ్లి చేసిన రన్స్ 76 కావడం గమనార్హం. మాజీ కెప్టెన్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా కోహ్లి చేస్తున్న దానికి అందరిలో కోపం కట్టలు తెంచుకుంటోంది.
కపిల్ దేవ్ అయితే కోహ్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రోజురోజుకు ఇంకా దిగజారిపోతున్నాడని ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అటు బ్యాట్ తో సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతున్నాడు. మాజీ కెప్టెన్ అయి ఉండి ఇంత నిర్లక్ష్యంగా ఆడటంపై పలువురు నిందిస్తున్నారు. అందుకే కెప్టెన్సీ నుంచి కూడా దూరమైనా అతడిలో మార్పు కనిపిండం లేదు. దీంతో విరాట్ కోహ్లి భవితవ్యం అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా మారింది.
Also Read: Prabhas Food: ప్రభాస్ పర్ఫెక్ట్ గా వండే ఫుడ్ ఇదే, ఎక్కడ వండుతాడో తెలుసా ?
ప్రస్తుతం అతడు చేస్తున్న పనికి కూడా ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా కమర్షియల్ యాడ్ ను ప్రమోట్ చేస్తూ వీడియోలు పెట్టడంతో అభిమానులు ఇంకా తిడుతున్నారు. లేవడం, స్నానం చేయడం, ఆన్ సైట్ ఆఫ్ స్టంప్ మీదుగా బాల్ ఆడి ఔటవ్వడం, పడుకోవడం ఇదేగా కోహ్లి దినచర్య అని వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. కానీ కోహ్లిలో ఎలాంటి మార్పు రావడం లేదు. తనకు సిగ్గు కూడా ఉందో లేదో అనే అనుమానాలు ప్రేక్షకుల్లో వస్తున్నాయి. జట్టుకు దూరం చేసినా అతడు ఆట గురించి ఆలోచించకుండా యాడ్స్ గురించి పోస్టులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇవ్వలేదు వేటు వేశారని పలువురు చర్చించుకుంటున్నారు. అయినా కోహ్లి ఎలా ఫామ్ లోకి రావాలనే తపన అతడిలో కనిపించడం లేదు. జట్టుకోసం ఎంపిక చేయకపోయినా ఫర్వాలేదనే వాదనతోనే హాయిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంత ఉదాసీనంగా ఉండే ఆటగాడిని ఇంతవరకు చూడలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. టీమిండియా విజయంలో తనదైన పాత్ర పోషించాలని ప్రతి క్రీడాకారుడు కోరుకుంటాడు. కానీ కోహ్లి మాత్రం తనకు విశ్రాంతి కావాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని అభిమానులు హాట్ హాట్ గా కామెంట్లు పెడుతుండటం గమనార్హం.
Also Read:Ileana: కత్రినా కైఫ్ సోదరుడితో హీరోయిన్ ఇలియానా ప్రేమాయణం..త్వరలోనే పెళ్లి ?