Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ లో 50 కిలోల ప్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుకు గురి కావడం దేశం యావత్తును కన్నీరు పెట్టిస్తోంది. ఆమె డిస్ క్యాలి ఫై కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. కేవలం 100 గ్రాముల అధిక బరువు వల్ల ఆమెపై వేటు వేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని దెప్పిపొడుస్తున్నారు. పారిస్ ఒలంపిక్స్ లో మహిళల 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ సంచలన విజయాలు సాధించింది. అద్భుతమైన ప్రదర్శన చేసి ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళింది. దీంతో భారత్ కు గోల్డ్ మెడల్ ఖాయమని అందరూ అనుకున్నారు. అంతేకాదు ఒలింపిక్స్ చరిత్రలో చివరి అంచె దాకా వెళ్ళిన తొలి మహిళ రెజ్లర్ గా వినేశ్ ఫొగాట్ సరికొత్త ఘనత అందుకుంది..
ఫైనల్ మ్యాచ్ లో వినేశ్ ఫొగాట్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు అమెరికా రెజ్లర్ సారా హిండె బ్రాండ్ తో కలిసి ఫైనల్ లో తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఆమె తన విభాగంలో ఉండాల్సిన దానికంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో ఒలింపిక్స్ కమిటీ ఆమెపై వేటువేసింది. దీంతో మెడల్ దక్కించుకోకుండానే ఆమె రిటర్న్ రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఒలింపిక్ నిబంధనల ప్రకారం అనర్హత వేటుకు గురైన ఏ క్రీడాకా రిణికి కూడా మెడల్ ఇవ్వరు. దీంతో మహిళల 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో గోల్డ్, బ్రాంజ్ మెడల్ మాత్రమే నిర్వాహకులు ఇవ్వనున్నారు.
వినేశ్ ఫొగాట్ అనర్హత వ్యవహారంలో ఆమె సహాయక సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.”మంగళవారం వినేశ్ ఫొగాట్ వరుసగా మూడు మ్యాచ్ లకు ఆమె 50 కిలోల బరువు ఉంది. ఒక్కసారిగా అలా ఎలా పెరిగింది? శక్తి కోసం ఆమెకు అందించిన ఫ్లూయిడ్స్ వెయిట్ పెరిగేందుకు కారణమయ్యాయి? లేకుంటే ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా? కావాలనే ఆమెను డిస్ క్యాలిఫై అయ్యేలా కుట్రలు ఏమైనా చేశారా? ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ లో కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన సిబ్బంది.. ఇలాంటి పనిచేయడం ఏంటి? చూస్తుంటే ఏదో జరిగిందని అనుమానం కలుగుతోంది. మొత్తానికి అంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ ఆమె బరువు పెరిగింది. దీనికి ఒలింపిక్ కమిటీ ఒంటెత్తు పోకడ కూడా కారణమైంది. మొత్తానికి భారత్ కు మెడల్ దూరమైందని” నెటిజన్లు వాపోతున్నారు.
100 గ్రాములు బరువు ఉన్న నేపథ్యంలో వినేశ్ ఫొగాట్ దానిని తగ్గించుకునేందుకు రాత్రి మొత్తం తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ ఆమె బరువు తగ్గలేదు. ఈ విషయం ఆమెకు ముందే తెలుసు కాబట్టి ఫైనల్ నుంచి తప్పుకొని ఉంటే కనీసం సిల్వర్ మెడల్ అయినా లభించేది. బరువు తగ్గించుకునే క్రమంలో ఆమె అనేక ప్రయత్నాలు చేసింది. జుట్టు కత్తిరించుకుంది. శరీరం నుంచి కొంతమేర రక్తాన్ని తొలగించుకుంది. డైట్ పూర్తిగా మానేసింది. రాత్రి మొత్తం జాగింగ్ చేసింది. రన్నింగ్ చేసింది. అయినప్పటికీ ఆమె బరువు తగ్గలేదు. అయితే తన శరీరాన్ని బరువు తగ్గించుకునేందుకు తీవ్రంగా కష్టపెట్టిన ఆమె.. డిహైడ్రేషన్ కు గురైంది. ఫలితంగా ఆమెను ఒలింపిక్స్ క్రీడా గ్రామంలోని ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలు పీటి ఉష పరామర్శించారు. చేతికి కాన్యూలా ధరించి ఉన్న వినేశ్ ఫొగాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Negligence of vinesh phogat support staff if they had done that they would have got a medal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com