Navjyoth Singh siddu: ఐపీఎల్ అంటేనే కాసులతో కూడుకున్న వ్యవహారం. చీర్ లీడర్స్ నుంచి మొదలు పెడితే కామెంటేటర్ల వరకు.. డబ్బులతోనే ముడిపడి ఉంటుంది. అయితే ఈసారి ఐపీఎల్ 17వ సీజన్లో కామెంటేటర్ గా వెటరన్ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు సరికొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నాడు. అయితే దీనికి సంబంధించిన ప్రయాణం పై అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వాస్తవానికి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు హాయ్ వోల్టేజ్ లో సాగుతుంటాయి. అభిమానుల కేరింతలకు కామెంటేటర్ మాటలు తోడైతే ఆ మ్యాచ్ మరో విధంగా ఉంటుంది. ఉత్కంఠను, ఆసక్తిని మరింత పెంచుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత భారత మాజీ క్రికెటర్ సిద్దు క్రికెట్ కామెంట్రీలోకి అడుగుపెడుతుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా సిద్దు మాట్లాడితే హాస్యం మిళితమై ఉంటుంది. అయితే ఈసారి కామెంటేటర్ అవతారం ఎత్తుతున్న నేపథ్యంలో.. అతడి మాటలను ప్రేక్షకులు ఆస్వాదించే అవకాశం ఉంది.. మాటలకు తనదైన ఎంటర్టైనింగ్ జోడించడంలో సిద్దు సిద్ధహస్తుడు.. ఇక ఇటీవల ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కు సిద్దు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.. తన క్రికెట్ ప్రయాణం, రెమ్యూనరేషన్ వంటి విషయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశాడు..
“టి20 ప్రపంచ కప్ చెట్లను నిర్ణయించడంలో ఐపీఎల్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కేవల్ ఇండియా మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా ఐపీఎల్ టోర్నీని జాగ్రత్తగా పరిశీలిస్తాయి. జూన్లో టి20 వరల్డ్ కప్ మొదలవుతుంది. ఐపీఎల్ లో ఆడే ఆటగాళ్లు సత్తా చాటి.. జాతీయ జట్లలో స్థానం దక్కించుకోవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్లోకి అడుగుపెట్టింది. ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వారు కీలకన్ కాబోతున్నారు. వారిద్దరూ గత రెండేళ్ల నుంచి పెద్దగా టి20 లు ఆడకపోయినప్పటికీ.. భారత జట్టుకు వారి నైపుణ్యం బలంగా మారనుంది. వారిద్దరికీ మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని” సిద్దు అన్నాడు.
“నేను ప్రస్తుతం క్రికెట్ వదిలిపెట్టి కామెంట్రీ లో చేరాను. ఇది నేను చేయగలనా అనే అప నమ్మకం ఒకప్పట్లో ఉండేది. అని ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గత ప్రపంచ కప్ లో 10 నుంచి 15 రోజుల వరకు సిద్దు ఇజం అనే ఒక పదం పుట్టింది. నేను నా మార్గంలో నడుస్తాను. ఇతరులు అందులో నడవడం లేదు. అది నా ఇజం ప్రత్యేకం. ఒకప్పుడు ఒక టొర్నికి 60 నుంచి 70 లక్షల వరకు తీసుకునేవాన్ని. ఇప్పుడు రోజుకు 25 లక్షలు తీసుకుంటున్నాను. కాబట్టి డబ్బు ముఖ్యం కాదు. చేసే పనిలో సంతృప్తి ఉండాలి. ఈసారి 17వ సీజన్ కాబట్టి.. మీలాగే నేను కూడా ఈ టోర్నీ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని” సిద్దు పేర్కొన్నాడు.