Natu Natu -WPL : డబ్ల్యూపీఎల్ టి20 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ వేడుకలు అదిరిపోయాయి.. బాలీవుడ్ అందాల తారలు కియారా అద్వానీ, కృతి సనన్ నృత్యాలతో అలరించారు.. పంజాబీ సింగర్ ఏపీ థిల్లాన్ పాటలతో మైమరపింప చేశాడు.. దీంతో డీవై పాటిల్ స్టేడియం హోరెత్తిపోయింది.. సుమారు గంట పాటు సాగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఉర్రూతలూగించాయి. అనంతరం కృతి సనన్ ప్రవేశించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెండింతలు అయింది.. కృతి సనన్ తన స్టెప్పులతో స్టేడియం మొత్తాన్ని మరో లోకంలో విహరింపజేసింది. ఆపై థిల్లాన్ తన గీతాలతో అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. మొత్తంగా కియారా,కృతి, థిల్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వహ్వా అనిపించేలా చేశారు. అనంతరం ఐదు జట్ల కెప్టెన్లు హర్మన్, స్మృతి, అలీసా, హీలీ, మెగ్ లానింగ్, బెత్ మూనీ వేదిక మీదకు వచ్చి ట్రోఫీ ఆవిష్కరించారు.
ఊపేసిన నాటు
ప్రారంభ వేడుకల్లో “ఆర్ఆర్ఆర్” లోని నాటునాటు పాట ఊపేసింది. ఈ పాటకి అభిమానులు రెచ్చి పోయి డ్యాన్స్ వేశారు. ఇటీవల ఈ పాట పలు అంతర్జాతీయ పురస్కారాలు సాధించడంతో విశేష ప్రాచుర్యం లోకి వచ్చింది. ఆస్కార్ అవార్డు కు కూడా నామినేట్ అయింది. ఈ పాటను అలపించిన రాహుల్ కు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేదిక మీద పాడే అవకాశం వచ్చింది. ఈ పాట కు తగ్గట్టుగా లేజర్ లైట్ కాంతులు మిరమిట్లు గొలపడంతో డీవై పాటిల్ స్టేడియం హోరెత్తిపోయింది. ఈ పాటకి ముంబై ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీ చప్పట్లు కొడుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
కాగా తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై ముంబై ఇండియన్స్ జట్టు గెలుపొందింది.. టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే తొలత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 15.1 ఓవర్లలో 64 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ గా ముంబై జట్టు కెప్టెన్ హర్మన్ నిలిచారు.
#NaatuNaatuSong Hindi version at DY Patil Stadium #Mumbai at #WPL2023 Opening Ceremony. My son who was watching this match sent this video. #GGvMI pic.twitter.com/XbRo1Aw3v8
— Nellutla Kavitha (@iamKavithaRao) March 4, 2023