N Jagadeesan: కొన్ని సంవత్సరాల దాకా స్టువర్టు బ్రాడ్ (Stuart broad) కు యువరాజ్ కొట్టిన కొట్టుడు కలలో కూడా వచ్చేదట. అందువల్ల అతడు సరిగ్గా నిద్ర కూడా పోయేవాడు కాదట. అయితే ఇప్పుడు టి20 క్రికెట్లో మరో రికార్డు నమోదయింది. కాకపోతే ఇది అంతర్జాతీయ టోర్నీ కాదు.. మనదేశంలో జరుగుతున్న దేశవాళీ క్రికెట్ టోర్నీ.. వర్ధమాన ఆటగాళ్లలో ప్రతిభను ప్రోత్సహించడానికి.. వారికి అద్భుతమైన అవకాశాలు కల్పించడానికి బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తోంది. ఈ ట్రోఫీ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. ఇప్పుడు ఈ టోర్నీలో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు, రాజస్థాన్ జట్లు పోటీ పడుతున్నాయి. ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టుగా ఆడుతున్నారు. తమలో ఉన్న ప్రతిభను బయట పెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు ఆడుతున్న నేపథ్యంలో సెలెక్టర్లు పండగ చేసుకుంటున్నారు. టీమిండియా కు బలమైన ఆటగాళ్లను అందించే అవకాశం లభించిందని పేర్కొంటున్నారు.
ఏడు ఫోర్లు కొట్టాడు
విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, రాజస్థాన్ జట్లు ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా పెను సంచలనం నమోదయింది. తమిళనాడు ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు ఆటగాడు జగదీషన్ సరికొత్త రికార్డులు నమోదు చేశాడు. రాజస్థాన్ బౌలర్ అమన్ సింగ్ బౌలింగ్లో ఒకే ఓవర్ లో ఏడు ఫోర్లు కొట్టాడు. తమిళనాడు ఇన్నింగ్స్ లో రెండో ఓవర్ లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. అమన్ సింగ్ బౌలింగ్ లో తొలి బంతి వైడ్ గా వెళ్ళింది. అయినప్పటికీ ఆ బంతిని జగదీషన్ బౌండరీ వైపు తరలించాడు. ఆ తర్వాత మిగతా బంతులను అతడు బౌండరీల వైపు మళ్ళించాడు. అప్పర్ కట్, మిడిల్ కట్, కవర్ డ్రైవ్, హుక్ షాట్.. ఇలా అతడు చేయని ప్రయోగాలు అంటూ లేవు. అమన్ సింగ్ ఎలాంటి బంతులు వేసినా జగదీషన్ బౌండరీ టార్గెట్ అన్నట్టుగా.. బంతులను కొట్టాడు. ద్వారా తమిళనాడుకు భారీగా పరుగులు నమోదయ్యాయి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 267 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే ఈ టార్గెట్ ను చేదించడానికి తమిళనాడు జట్టు పోరాడుతోంది. ముందుగా రాజస్థాన్ బ్యాటింగ్ చేసి.. అద్భుతంగా ఆడింది. రాజస్థాన్ క్రికెటర్లు తమిళనాడు బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొన్నారు. ధాటిగా పరుగులు చేశారు. అందువల్లే తమిళనాడు ఎదుట 268 రన్స్ టార్గెట్ విధించారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తమిళనాడు ఆటగాడు జగదీషన్ ఒకే ఓవర్ లో ఏడు ఫోర్లు కొట్టాడు. ఇందులో తొలి బంతి వైడ్ అయినప్పటికీ.. దానిని అతడు ఫోర్ గా మలచడం విశేషం. #VijayHazareTrophy #TNvsRJ #jagadishan pic.twitter.com/vHHffaHxyd
— Anabothula Bhaskar (@AnabothulaB) January 9, 2025