https://oktelugu.com/

Mumbi Indians: ముంబై ఇండియన్స్ మళ్లీ ఫట్.. ఈసారి టైటిల్ రేసులోంచి ఔట్

Mumbi Indians: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తేలిపోయింది. ఈసారి మెగా వేలంలో కీలక ఆటగాళ్లను కోల్పోయిన ముంబై మునుపటిలా రాణించడం లేదు. బ్యాటింగ్ బలం కూడా తగ్గిపోయింది. ఇక కీలక బౌలర్లు కూడా చెల్లాచెదురై ఇతర జట్లు కొనేయడంతో ముంబై బౌలింగ్ బలం తగ్గిపోయింది. దీంతో మునుపటి ముంబైలా కనిపించడం లేదు. గత ఐదు మ్యాచుల్లో ఓడిన ముంబై ఈరోజు మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడితే అంతే […]

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2022 / 08:59 PM IST
    Follow us on

    Mumbi Indians: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తేలిపోయింది. ఈసారి మెగా వేలంలో కీలక ఆటగాళ్లను కోల్పోయిన ముంబై మునుపటిలా రాణించడం లేదు. బ్యాటింగ్ బలం కూడా తగ్గిపోయింది. ఇక కీలక బౌలర్లు కూడా చెల్లాచెదురై ఇతర జట్లు కొనేయడంతో ముంబై బౌలింగ్ బలం తగ్గిపోయింది. దీంతో మునుపటి ముంబైలా కనిపించడం లేదు.

    గత ఐదు మ్యాచుల్లో ఓడిన ముంబై ఈరోజు మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడితే అంతే సంగతులు. అలాంటి క్లిష్ట సమయంలో ఈరోజు లక్నోతో తలపడింది. గెలవడానికి శక్తివంచన లేకుండా కృషి చేసింది. కానీ లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ వీరోచిత సెంచరీ కొట్టడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఫలితంగా టీ20 మెగా టోర్నీలో వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది.

    కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి కేవలం 60 బంతుల్లోనే 114 పరుగులు చేయడంతో లక్నో ఏకంగా 199 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ముంబై 181 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ సహా సహా అందరూ తేలిపోయారు. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై విజయం అంచుల వరకూ వచ్చి ఆగిపోయింది. గెలుపు వాకిలి తొక్కలేకపోయింది.

    ముంబై ఓడిపోవడంతో ఇక ప్లేఆఫ్ చేరే అవకాశాలు లేకుండా పోయాయి. వరుసగా 6 ఓటములతో ముంబై ఈ సీజన్ నుంచి ఔట్ అయినట్టేనని అంటున్నారు. ముంబై ఈ మ్యాచ్ లో గెలిచి ఇక విజయాల బాట పట్టాలని పట్టుదల ప్రదర్శించింది. కానీ టీ20 లీగ్ లో కేఎల్ రాహుల్ కిది వందో మ్యాచ్. ఇందులో సెంచరీ కొట్టడం విశేషం. ఈ దెబ్బతో ముంబై ఐపీఎల్ ఆశలు అడియాసలైనట్టే కనిపిస్తోంది.