Mumbai Indians: గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం రాజస్థాన్ రాష్ట్రంలోని పలు మారుమూల గ్రామాలలో ప్రజలకు సౌర దీపాలు పంపిణీ చేసింది. ఇక ఐపీఎల్ నిర్వాహక కమిటీ డాట్ బాల్స్ కు ఇన్ని చొప్పున మొక్కలు నాటుతోంది. ఇక బెంగళూరు జట్టు ప్రతి సీజన్లో ఒకరోజు గ్రీన్ జెర్సీ ధరించి.. పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పిస్తోంది. ఇక ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విభిన్నమైన కార్యక్రమాన్ని చేపడుతుంది. దానికి ESA day అని పేరు పెట్టింది. ప్రతి ఏడాది దీనిని నిర్వహిస్తుంది. దానివల్ల వందలాది మంది విద్యార్థుల కళ్లల్లో ఆనందం చూస్తుంది.
Also Read: ధోని ఉన్నా.. చెన్నై జట్టుకు ఏంటి ఈ దుస్థితి.. సురేష్ రైనా ఏం చెప్పాడంటే..
ఏం చేస్తుందంటే
ESA day అంటే ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ అని అర్థం. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు అన్ని ఎన్జీవోల పరిధిలో ఉన్న విద్యార్థులను ఒకే వేదిక వద్దకు తీసుకొస్తారు. వారి ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోని ఆటగాళ్ల దృశ్యాలను చిత్రీకరిస్తారు. వాటిని ముంబై ప్లేయర్ల ముందు ఉంచుతారు. ఆ దృశ్యాలను చూసి ప్లేయర్లు ఆనందం వ్యక్తం చేస్తారు. తద్వారా తమ చిత్రాలు గీసిన విద్యార్థులకు ముంబై ఆటగాళ్లు ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈసారి కూడా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం అదే పని చేసింది. ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, లసిత్ మలింగ, హార్దిక్ పాండ్యా.. ఇంకా మిగతా ఆటగాళ్ల దృశ్యాలను విద్యార్థులు చిత్రీకరించారు.. అవన్నీ అత్యంత సహజంగా ఉన్నాయి. విద్యార్థులు చిత్రీకరించిన ఆ దృశ్యాలను ముంబై జట్టు యాజమాన్యం ఆటగాళ్ల ముందు ఉంచింది. దీంతో ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరైతే ఆనంద భాష్పాలు రాల్చారు. ఇక ఈ వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. తన దృశ్యాన్ని చూసిన రోహిత్ శర్మ.. తనకు గడ్డాన్ని మరింతగా వేశారని వ్యాఖ్యానించాడు. లసితమాలింగ తన బౌలింగ్ యాక్షన్ అచ్చు గుద్దినట్టు దింపారని పేర్కొన్నాడు. తన చేతికి ఉన్న గడియారాన్ని చూసి ఈ బొమ్మ నాదేనని గుర్తుపట్టానని అశ్విని కుమార్ వ్యాఖ్యానించాడు. చివర్లో హార్థిక్ పాండ్యా మాట్లాడాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు మీరు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. ఈ ప్రోత్సాహం ఎప్పటికీ కొనసాగాలి. ముంబై జట్టు ఇదే విధంగా విజయాలు సాధించేలా తోడ్పాటు ఇవ్వాలని అతడు కోరాడు. కాగా, రిలయన్స్ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తుంది. మెరుగైన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి ఉన్నత చదువులు చదివిస్తుంది. వారికి రిలయన్స్ కంపెనీలలో ఉద్యోగాలు కూడా ఇస్తుంది.
MI CELEBRATING EDUCATION & SPORTS FOR ALL
– As a part of ESA Day, Rohit & other MI stars reacting to pictures drawn by children from different NGOs are associated with Reliance Foundation.
Mumbai Indians making the future bright for India. pic.twitter.com/rzp1cPKZVQ
— Johns. (@CricCrazyJohns) April 26, 2025