Homeక్రీడలుక్రికెట్‌International T20 League : గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి.. ఇంటర్నేషన్‌ లీగ్‌లో ముంబైకి షాక్‌!

International T20 League : గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి.. ఇంటర్నేషన్‌ లీగ్‌లో ముంబైకి షాక్‌!

International T20 League : ఇంగ్లండ్‌ కౌంటీలను చూసి భారత్‌తో ఐపీఎల్‌ ప్రారంభించారు. కేవలం 20 ఓవర్లతో జరిగే ఈ మ్యాచ్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో చాలా దేశాలు ఐపీఎల్‌ తరహా టోర్నీలు నిర్వహిస్తున్నాయి. ఇక దుబాయ్‌ వేదికగా ఇంటర్నేషన్‌ టీ20 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. 2025 ఎడిషన్‌ జనవరి 11న ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌(Mumbai Indians Emirates).. దుబాయ్‌ క్యాపిటల్స్‌తో తలపిడింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియాకు పరాభవం ఎదురైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాలో ఓడిపోయింది. విధ్వంసకర ఆటగాళ్లు నికోలస్‌ పూరన్, కీరన్‌ పొలార్డ్‌ జట్టులో ఉన్నా ముంబైకి ఓటమి తప్పలేదు.

మ్యాచ్‌ ఇలా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాంటింగ్‌ చేసిన దుబాయ్‌ క్యాపిటల్స్‌(Dubai Capitals) నిరీణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దుబాయ్‌ ఆటగాళ్లలో బ్రాండన్‌ మెకముల్లెన్‌(42 బంతుల్లో 58, 4 ఫోర్లు, 3 సిక్సులు) ఒక్కడే అర్ధసెంచరీ చేశాడు. రోవమన్‌ పావెల్‌(25), దసున్‌ షనక(13), కెప్టెన్‌ సికందర్‌ రజా(10) రెండంకెల స్కోర్లు చేశారు. షాయ్‌ హోప్‌ 9, రోస్సింగ్టన్‌ 9, గుల్బదిన్‌ నైబ్‌ 2, ఫర్హాన్‌ ఖాన్‌ 2(నాటౌట్‌) పరుగులు చేశారు. ముంబై ఎమిరేట్స్‌లో పేసర్‌ ఫజల్‌క ఫారూMీ ఐదు వికెట్లు తీశాడు. 4–0–16–5తో రాణించాడు. అల్జరీ జోసఫ్‌ జహూర్‌ ఖన్‌ తలో వికెట్‌ తీశారు.

లక్ష్య ఛేదనలో తడబడి..
ఇక స్వల్ప లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌ మొదలు పెట్టిన ముంబై ఎమిరేట్స్‌ కూడా తడబడింది. జట్టు 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోకి కష్టాలో పడింది. ఈదశలో నికోలస్‌ పూరన్‌(40 బంతుల్లో 60, 3 ఫోర్లు, 4 సిక్సులు) జట్టును గెలిపించేందుకు యత్నించాడు. పూరన్‌ను ఆఖీల్‌ హుస్సేన్‌(31 బంతుల్ల 30 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో కీరన్‌ పొలార్డ్‌(15 బంతుల్లో 16) పరుగులు చేసినా జట్టును గెలిపించలేదు. చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సి ఉండగా పొలార్డ్‌ ఫోర్‌ కొట్టాడు. దీంతో ఒక పరుగు తేడాతో ముంబై ఎమిరేట్స్‌ ఓడిపోయింది. ముంబై జట్టులో మహ్మద్‌ వసీం, ఆండ్రీ ఫ్లెచర్, ఆల్డరీ జోసఫ్‌ డకౌట్‌ అయ్యారు. కుసాల్‌ పెరారీ 12, టామ్‌ బాంటన్‌ 7 పరుగులు చేశాడు.

దెబ్బతీసిన గుల్బదిన్‌ నైబ్, ఓల్లీ స్టోన్‌
పటిష్ట దశలో ఉన్న ముంబై ఎమిరేట్స్‌ సునాయాసంగా గెలుస్తుందని భావించారు. 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే సాదించాల్సిన దశలో బౌలర్లు గుల్బదిన్‌ నైబ్‌(4–0–13–3), ఓల్లీ స్టోన్‌(4–1–14–2) దెబ్బతీశారు. గెలుసును దూరం చేశారు. 18వ ఓవర్‌ వేసిన గుల్బదిన్‌ ౖ¯ð బ్‌ కీలక రెండు వికెట్లు తీశాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్‌లో ఓల్లీ స్టోన్‌ మరింత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా ఫర్హాన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌ రెండు బౌండరీలు బాదినా ప్రయోజనం లేకపోయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular