Syed Mushtaq Ali Trophy : అర్జున్ టెండూల్కర్ గోవా జట్టులో ఆడుతున్నాడు. అయితే ఇటీవలి రంజిత్రోఫీ ఐదో రౌండ్ మ్యాచ్లో అతడు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్ ద్వారా అతడు తన కెరీర్లో తొలిసారి ఫైవ్ వికెట్ హాల్ దక్కించుకున్నాడు. అయితే ఐదు వికెట్ల ప్రదర్శన చేయడంతో ఐపీఎల్ 2025 సీజన్లో అతడిని కొనుగోలు చేయడానికి అన్ని జట్లు పోటీ పడతాయని అందరూ అనుకున్నారు. కానీ అతడేమో ఆ ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్ వేదికగా ముంబై జట్టు తో శనివారం గోవా తలపడింది. అయితే ఈ మ్యాచ్లో అర్జున్ దారుణంగా విఫలమయ్యాడు.
దుమ్మురేపిన అయ్యర్
ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ అయ్యర్ 57 బంతుల్లో 130* పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి. అర్జున్ దారుణంగా పరుగులు ఇచ్చాడు. అర్జున్ 4 ఓవర్లు వేసి.. 48 పరుగులు ఇచ్చాడు.. ఇందులో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.. త్వరలో ఐపీఎల్ వేలం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అర్జున్ ఇలా తేలిపోవడం అతనికి నష్టం చేకూర్చుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. టి20 ఫార్మేట్ కు అర్జున్ ఎందుకు సెట్ కావడం లేదో అంతుచిక్కడం లేదని వారు చెబుతున్నారు. అయితే అతడు సరైన ప్రదర్శన చేయకపోవడం.. ఆది, సోమవారం లో జరిగే మెగా వేలంలో అతడి కొనుగోలు తీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కనీస ధరకే..
అర్జున్ ప్రస్తుతం 30 లక్షల కానీ వేలానికి అందుబాటులో ఉన్నాడు. అయితే అతడిని ముంబై జట్టు కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ముంబై జట్టు కొనుగోలు చేయకపోతే అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో అతడు చేరుతాడు.. అయితే గత రెండు సీజన్లలో ముంబై జట్టు అతడిని కనీస ధరకే కొనుగోలు చేసింది. సచిన్ ముంబై జట్టుకు దీర్ఘకాలం ఆడటం.. అతనితో అంబానీ కుటుంబానికి సన్నిహిత సంబంధం ఉండడంతో అర్జున్ ను కొనుగోలు చేశారని తెలుస్తోంది. అయితే ఈసారి కూడా అంబానీ కుటుంబం అదే పని చేస్తుందని సమాచారం. అర్జున్ దేశవాళీ టెస్ట్ క్రికెట్లో మెరుగ్గా ఆడుతున్నప్పటికీ.. టి20 ఫార్మేట్ కు వచ్చేసరికి తేలిపోతున్నాడు. అది సచిన్ అభిమానులను కృంగదీస్తోంది. ఒకవేళ ఈసారి ముంబై జట్టు అతనిని కొనుగోలు చేస్తే.. ఈ సీజన్లోనైనా అతడు సత్తా చాటాలని సచిన్ అభిమానులు కోరుకుంటున్నారు. ముంబై జట్టు తరఫున అర్జున్ 5 మ్యాచ్లు ఆడాడు. కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆవేశాన్ని అణుచుకోలేని అర్జున్.. బౌలింగ్ విషయంలో మాత్రం ఆ స్థాయిలో ప్రతిభ చూపించలేకపోతున్నాడు. అదే అతడి భవితవ్యాన్ని దెబ్బతీస్తోంది.