https://oktelugu.com/

Ajinkya Rahane :97 పరుగుల వద్ద ఔటయ్యావేంటి భయ్యా.. పిచ్ లోకి వస్తున్నప్పుడు ఏమైనా దరిద్రానికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చావా?

అతడు ఒకప్పుడు టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్లో సంచలనాలు సృష్టించాడు. మంచి నీళ్లు తాగినంత సులభంగా అర్థ సెంచరీలు.. షూ లేస్ కట్టుకున్నంత సులభంగా సెంచరీలు చేశాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. టీమిండియాలోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 2, 2024 / 04:19 PM IST

    Ajinkya Rahane

    Follow us on

    Ajinkya Rahane : పై ఉపోద్ఘాతం మొత్తం టీమిండియా ఈ ఆట గాడు అజింక్యా రహానే గురించి.. ప్రస్తుతం దేశవాళి క్రికెట్లో రహానే ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ముంబై జట్టు ఇరానీ కప్ లో ఆడుతోంది. రెస్ట్ ఆఫ్ ఇండియా తో జరుగుతున్న మ్యాచ్లో తలపడుతోంది. ఈ క్రమంలో ముంబై జట్టు కెప్టెన్ రహానే తృటిలో సెంచరీ కోల్పోయాడు. బుధవారం రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్ వేసిన అద్భుతమైన బౌన్సర్ కు బలయ్యాడు. ముంబై జట్టుకు సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి రహనే ఐదో వికెట్ కు 131 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఈ దశలోనే రహానే 97 పరుగుల వద్దకు చేరుకున్నాడు. సెంచరీ చేస్తాడు అనుకుంటున్న తరుణంలో యష్ వేసిన అద్భుతమైన బౌన్సర్ కు అవుట్ అయ్యాడు. ఆ బంతిని అంచనా వేయడంలో రహనే విఫలమయ్యాడు. ఆ బంతి నేరుగా వికెట్ మీదకు దూసుకు రావడంతో రహానే మొదట షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే చివరి నిమిషంలో దానిని వదిలివేయాలని భావించాడు. అయితే ఆ బంతి అతడి గ్లవ్స్ ను తాగుతూ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాట్ అవుట్ అని ప్రకటించాడు. దీంతో రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఏమాత్రం సమయం వృధా చేయకుండా రివ్యూ కి వెళ్ళాడు. దీంతో థర్డ్ ఎంపైర్ రివ్యూ లో బంతి రహనే గ్లవ్స్ కు తగిలిందని తేలింది. దీంతో థర్డ్ ఎంపైర్ రహా నేను అవుట్ గా ప్రకటించాడు.

    ఆ బంతి గ్లవ్స్ ను తగిలిన వెంటనే కీపర్ జురెల్ వెంటనే అందుకున్నాడు. దీంతో రహానే నిరాశతో మైదానాన్ని వీడాడు. అప్పటికి రహానే స్కోరు 97 పరుగులు. సర్ఫ రాజ్ ఖాన్ తో కలిసి రహానే ఐదో వికెట్ కు 131 పరుగులు జోడించాడు. వీరిద్దరూ ముంబై జట్టుకు స్థిరత్వాన్ని తీసుకొచ్చారు. ఒకానొక దశలో 149/4 వద్ద కష్టాల్లో ముంబై జట్టు ఉండగా.. వీరిద్దరూ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. దీంతో ముంబాయి పటిష్ట స్థితిలో నిలిచింది. రహానే అవుట్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో అతడికి సంఘీభావంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. “97 పరుగుల వద్ద ఔటయ్యావేంటి భయ్యా.. పిచ్ లోకి వస్తున్నప్పుడు ఏమైనా దరిద్రానికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చావా?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.