MS Dhoni wedding speech: మైదానంలో నిశ్శబ్దంగా ఉంటాడు. వికెట్ల వెనుక ప్రణాళికలు రచిస్తూ క్షణాల్లోనే అమలులో పెడుతుంటాడు. ఓటమి నుంచి గెలుపుకు జట్టును తీసుకెళ్తుంటాడు. అతడి చతురత అద్భుతం. అతడి వ్యూహాత్మకత అనితర సాధ్యం. అందువల్లే క్రికెట్లో మహేంద్రసింగ్ ధోనీని mastermind behind the wickets అని పిలుస్తుంటారు. ధోని మైదానంలో నిశ్శబ్దంగా ఉంటాడని అందరికీ తెలుసు. తోటి ప్లేయర్లతో తక్కువ మాట్లాడుతుంటాడని కూడా తెలుసు. జాతీయ జట్టుకు వీడ్కోలు పలికిన తర్వాత ధోని తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. వివిధ సంస్థలకు ప్రకటనలు చేస్తున్నాడు.
భార్యతో కలిసి వివిధ వేడుకలకు వెళ్లే ధోని తనదైన శైలిలో అక్కడ హాస్య చతురత ప్రదర్శిస్తుంటాడు. కామెడీ టైమింగ్ తో అక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తుంటాడు. తాజాగా తన భార్యతో కలిసి ఒక వేడుకకు వెళ్ళిన మహేంద్ర సింగ్ ధోని నవ్వు తెప్పించే మాటలు మాట్లాడాడు. ఆ మాటలకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.
ఆమధ్య ఓ టీవీ ఛానల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ధోని పాల్గొన్నాడు. పిల్లలకు అనే విషయంపై ఎదురైన ప్రశ్నకు హార్డ్ వర్క్ అనే సమాధానం చెప్పాడు. వాస్తవానికి దూరం నుంచి అలాంటి సమాధానాన్ని ఆ టీవీ ఛానల్ నిర్వాహకులు అంచనా వేయలేదు. అయినప్పటికీ ధోని అలా మాట్లాడటంతో అక్కడున్న వాళ్లంతా నవ్వారు. తాజాగా భార్యతో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లిన ధోని వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
“వివాహం అత్యుత్తమమైనది. మీరు పెళ్లి చేసుకునే సందడిలో ఉంటారు. కొంతమంది మాత్రం నిప్పుతో చెలగాటం ఆడాలనుకుంటారు. ప్రస్తుతం పెళ్లి చేసుకుంటున్న యువకుడు కూడా అటువంటివాడే. అందరి భార్యలు ఒకే విధంగా ఉంటారు. నా సతీమణి కూడా అంతే. నేను వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఒక సభ్యుడిని. ఆ జట్టుకు నాయకుడిని. కానీ నా భార్య అది పట్టించుకోదు” అని ధోని అనడంతో అక్కడున్న వాళ్లంతా ఒకసారిగా నవ్వారు. అంతేకాదు నవ వధువు ఎలా ఉండాలో కూడా ధోని చెప్పాడు. భర్త కోపంగా ఉన్నప్పుడు భార్య నిశ్శబ్దంగా ఉండాలని.. కట్టుకున్న వాడి కోపం నిమిషాల్లోనే తగ్గిపోతుందని ధోని సూచించాడు. కానీ భార్య కోపం అలా ఉండదని ధోని అనడంతో అక్కడున్న వాళ్లంతా మరోసారి పగలబడి నవ్వారు.
Captain cool turning into Husband School ❤️ pic.twitter.com/tt7nD0I9Uf
— Professor Sahab (@ProfesorSahab) November 27, 2025