Dhoni Entertainment: భారత జట్టుకు ప్రపంచ కప్ అందించిన సారధుల్లో కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని ఇద్దరే మనకు కనిపిస్తారు. ఇక ఏ కెప్టెన్ కూడా వరల్డ్ కప్ సాధించలేదు. దీంతో వారికి ఉన్న క్రేజ్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. మిస్టర్ కూల్ గా పేరు పొందిని ధోని ఆటతీరు గురించి మనకు సుపరిచితమే. సారధిగా జట్టుకు ఎంతో సేవ చేశాడు. ఆయనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాడు. దీంతో జట్టు సభ్యుల్లో సమన్వయం చేసి వారిలోని ఆత్మవిశ్వాసాన్ని తొణికిసలాడేలా చేసి వారి సేవలను సైతం వినియోగించుకుని జట్టును పటిష్ట స్థితిలో ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
మహేంద్ర సింగ్ ధోని భారత జట్టును మంచి మార్గంలో నడిపించాడు. ఆటగాళ్ల సేవలను వినియోగించుకోవడంలో తనదైన శైలిలో వ్యవహరించి వారికి సరైన మార్గనిర్దేశం చేశాడు. దీంతోనే విజయాల పరంపర కొనసాగించాడు. మహేంద్ర సింగ్ ధోని కొత్త మార్గంలోకి వెళ్లనున్నాడు. క్రికెట్ కు విరామం ప్రకటించడంతో వ్యక్తిగత వ్యాపారాలు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే జార్ఖండ్ లో కూరగాయలు, పాలు తదితర వ్యాపారాలు చేపట్టాడు. ఇంకా కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నాడు. వ్యాపారంలో డబ్బులు రావడం ప్రారంభమైతే దానికి ఎంత అనేది లెక్క ఉండదు. దీంతోనే అతడు వ్యాపారాల వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.
మహేంద్ర సింగ్ ధోని కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాడు. ఇక మీదట సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా సినిమాలు నిర్మించడానికి నిర్ణయించుకున్నాడు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు నిర్మించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. త్వరలోనే ధోని ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేయాలని ధోని ఆలోచిస్తున్నాడు.
సెకండ్ ఇన్నింగ్స్ లో ధోని వ్యాపారాలపై మొగ్గు చూపుతున్నాడు. వ్యాపారాల్లో అయితే లాభాల పంట పండుతుందనే ఉద్దేశంతో ధోని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్ లో వ్యాపార రంగంలోనే రాణించాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. త్వరలోనే సినిమాల కోసం కంపెనీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. సినిమాల ద్వారా కూడా ఆదాయం ఎక్కువగానే వస్తుంది. కానీ నష్టాలు వస్తే మాత్రం కోలుకోవడం కష్టమే. కానీ ధోని ఏ మేరకు సినిమా రంగంలో రాణిస్తాడో వేచి చూడాల్సిందే. తన సంపదను రెట్టింపు చేసుకునే క్రమంలో ధోని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.