MS Dhoni Tears : ధోని కంట కన్నీళ్లు.. ఉద్వేగం ఆగలేదు.. ఎన్నడూ చూడని వీడియో

మైదానంలో తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసే ధోని.. మానసికంగానూ ఎంతో బలంగా ఉంటాడు. అయితే అటువంటి ధోని తాజాగా ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై గెలిచిన వేళ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా.? కానీ ఇది నిజం.

Written By: NARESH, Updated On : May 30, 2023 9:47 am
Follow us on

MS Dhoni Tears : ధోని అంటే కర్మ యోగి.. మైదానంలో అయినా.. బయట అయినా ఏ ఏమోషన్ ను ప్రదర్శించడు. లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి భారత్ కు వన్డే ప్రపంచకప్ అందించినా కూడా ధోనిలో ఎలాంటి ఏమోషన్ బయటపడలేదు. కానీ నిన్న ఐపీఎల్ లో చెన్నైని విజేతగా నిలిపాక మాత్రం ఏమోషనల్ అయ్యాడు. ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడూ బయటపడని ఏమోషన్ ను ధోని తాజాగా బయటపెట్టేశాడు.

మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ప్రపంచంలో ఒక ఐకాన్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ధోనీని పూజిస్తుంటారు. మైదానంలో తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసే ధోని.. మానసికంగానూ ఎంతో బలంగా ఉంటాడు. అయితే అటువంటి ధోని తాజాగా ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై గెలిచిన వేళ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా.? కానీ ఇది నిజం.

మైదానంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ధోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ మెలుగుతుంటాడు. జట్టు సాధించే విజయాలకు పొంగిపోడు.. అపజయాలకు కృంగిపోడు. రెండింటినీ ఒకే విధంగా తీసుకుంటాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహాలను పన్నడంలో ధోనీకి మించిన వాళ్లు మరొకరు ఉండరు. అందుకే ఫ్యాన్స్ ధోనీని కెప్టెన్ కూల్ అంటారు. అటువంటి ధోని నిన్న రాత్రి కన్నీళ్లను పెట్టుకున్నాడు. 2023 ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై గెలిచాక కన్నీళ్లు ఆపోలేకపోయాడు.

ప్రపంచ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ఎంతో క్రేజ్ ఉంది. కోట్లాది మంది ధోనీని అభిమానిస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్ లో ధోని సారథ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు లక్షలాది మంది అభిమానులు మద్దతు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నై జట్టు గెలవడంతో ధోని అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోనిపై తమకున్న అభిమానాన్ని వేలాదిమంది సందేశాల రూపంలో పంచుకుంటున్నారు. ఇదే చివరి సీజన్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సందేశాలను సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం పోస్ట్ చేస్తున్నారు. కానీ రిటైర్ మెంట్ పై ధోని స్పందించలేదు. ఈసారి కూడా కప్ ను అందించి రిటైర్ అవుతున్న అంబటిరాయుడు చేతులకే దాన్ని అందివ్వడం ధోని గొప్పతనం. అంతటి సాదాసీదా మనిషి కాబట్టే ధోనిని అందరూ లెజెండ్ అంటున్నారు.