MS Dhoni Return: ప్రస్తుత ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతోంది. మొదట్లో వరుసగా ఓటములు.. ఆ తర్వాత వరుసగా విజయాలతో చెన్నై జట్టు 50: 50 అన్నట్టుగా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో చెన్నై జట్టు ఇలాంటి ఒత్తిడి వాతావరణం ఎదుర్కొంది. ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా లేచింది. వరుస విజయాలతో ఏకంగా ట్రోఫీలను సాధించింది.
ప్రస్తుత ఐపీఎల్ లో కూడా చెన్నై జట్టు ప్రస్థానం అలాగే సాగుతున్న నేపథ్యంలో.. గత చరిత్ర పునరవృతమవుతుందా అని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నై జట్టులో ధోని లేడు. గాయం వల్ల అతడు ఇప్పటివరకు ఐపీఎల్లో అడుగుపెట్టలేదు. అయితే శనివారం హైదరాబాద్ జట్టుతో జరిగే మ్యాచ్లో ధోని ఆడతాడని తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన సామర్ధ్య పరీక్షల్లో అతడు నూటికి నూరు శాతం పాజిటివ్ రిజల్ట్ సాధించాడని.. అందువల్లే అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీనిపై చెన్నై యాజమాన్యం కూడా సానుకూల స్పందన వ్యక్తం చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో ధోని విజయవంతమైన పాత్ర పోషించాడు. సాధారణ ఆటగాళ్లతోనే అసాధారణ ప్రదర్శన చేయించి.. గొప్ప గొప్ప జట్లను ఓడించాడు ధోని. ధోని నాయకత్వంలో చెన్నై జట్టు అద్భుతమైన విజయాలు అందుకుంది. ఐదుసార్లు ట్రోఫీలు సాధించి సగర్వమైన చరిత్ర తన పేరు మీద రాసుకుంది. అయితే ఇప్పుడు ధోని లేకపోవడంతో చెన్నై జట్టు పరిస్థితి అంత గొప్పగా లేదు. గత ఏడాది తాత్కాలిక సారధిగా ఉన్నప్పటికీ.. ఆటగాళ్లలో సానుకూల దృక్పథం లేకపోవడంతో చెన్నై జట్టు విజయాలు సాధించలేకపోయింది. ఇదే విషయాన్ని ధోని కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు.
ఇప్పుడు గైక్వాడ్ కూడా చెన్నై జట్టు మీద తన బలమైన ముద్ర వేయలేకపోతున్నాడు. సరిగ్గా ఆడ లేకపోతున్నాడు. తీవ్ర స్థాయిలో అతడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు లోకి ధోని వస్తున్న నేపథ్యంలో గైక్వాడ్ మీద ఒత్తిడి తగ్గుతుందని.. ఎందుకంటే ధోని మైదానంలో యాక్టింగ్ కెప్టెన్ పాత్ర పోషిస్తే.. గైక్వాడ్ తన ఆట మీద మనసు లగ్నం చేస్తాడని చెన్నై అభిమానులు అంటున్నారు. ధోని వస్తే చెన్నై జట్టు తలరాత మారిపోతుందని.. కచ్చితంగా ట్రోఫీ సాధిస్తుందని చెన్నై అభిమానులు అంచనా వేస్తున్నారు.