https://oktelugu.com/

Dhoni: ధోనికి సాక్షి , జీవా హగ్ వెనుక కథ వేరే ఉంది?

Dhoni: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని మరోసారి విజేతగా నిలిపాడు ఎంఎస్ ధోని. అతడి పని అయిపోయిందనుకున్న వారికి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. పోయినసారి అట్టడుగున నిలిచిన చెన్నై సంవత్సరం తిరిగే సరికి చాంపియన్ గా అవతరించడం వెనుక ధోని క్రికెట్ బుర్ర ఉంది. ఐపీఎల్ ఫైనల్లో కోల్ కోతాను ఓడించి చెన్నైకి నాలుగోసారి టైటిల్ అందించాడు ధోని. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ గెలవగానే ధోని భార్య సాక్షి, […]

Written By:
  • NARESH
  • , Updated On : October 16, 2021 / 05:36 PM IST
    Follow us on

    Dhoni: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని మరోసారి విజేతగా నిలిపాడు ఎంఎస్ ధోని. అతడి పని అయిపోయిందనుకున్న వారికి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. పోయినసారి అట్టడుగున నిలిచిన చెన్నై సంవత్సరం తిరిగే సరికి చాంపియన్ గా అవతరించడం వెనుక ధోని క్రికెట్ బుర్ర ఉంది.

    ms dhoni and sakshi all set to become parents in 2022

    ఐపీఎల్ ఫైనల్లో కోల్ కోతాను ఓడించి చెన్నైకి నాలుగోసారి టైటిల్ అందించాడు ధోని. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ గెలవగానే ధోని భార్య సాక్షి, కూతురు జీవా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నాళ్లు దాచిన ఆనందాన్ని అంతా పెవిలియన్ పక్కన ఉన్న సెలబ్రెటీ కూర్చిల్లో కూర్చొని ఆనందించారు. ధోనికి ముద్దులు విసిరారు.

    మ్యాచ్ గెలిచాక ధోని నడిచి వస్తుంటే సాక్షి, జీవా వెళ్లి గట్టిగా హత్తుకున్నారు. మైదానంలో ధోనితో పాటు కలియతిరిగారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ధోని భార్య సాక్షి వేసుకున్న డ్రెస్ పై జోరుగా చర్చ జరిగింది. ధోని భార్య గర్భవతి అని.. ధోని రెండోసారి తండ్రికాబోతున్నాడనే ప్రచారం జరిగింది.

    దీనిపై ధోనికి అత్యంత సన్నిహితురాలైన క్రికెటర్ సురేశ్ రైనా భార్య ప్రియాంక బయటపెట్టింది. సాక్షితోపాటే స్టేడియంలో పక్కనే కనిపించే ప్రియాంక అసలు విషయాన్ని చెప్పింది. 2022లో సాక్షి మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వెల్లడించింది. ధోని రెండోసారి తండ్రి కాబోతున్నట్టు తెలిపింది.

    ధోని ఫ్యామిలీతో సురేశ్ రైనా దంపతులకు మంచి అనుబంధం ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కలిసి ఉంటారు. 2015లో జీవా పుట్టినప్పుడు కూడా మొదట ఆ విషయం సాక్షి రైనాకే చెప్పిందట.. ధోనికి చెప్పమని సూచించిందట.. అంతలా దగ్గరి ఫ్రెండ్స్ అయిన రైనా భార్య చెప్పిన విషయం తెలిశాక ధోని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈసారి ‘జూనియర్ ధోని’ రాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాడు.

    మహేంద్రసింగ్ ధోని-సాక్షి 2010, జులై 4న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015, ఫిబ్రవరి 6న జీవా జన్మించింది. ప్రస్తుతం వరల్డ్ కప్ లో టీమిండియా మెంటర్ గా ధోని కొనసాగబోతున్నాడు.