Mohammed Shami: ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి రోజుకో అప్డేట్ వస్తోంది. ముఖ్యంగా కొన్ని జట్ల యాజమాన్యాలు మీడియాకు లీకులు వదులుతున్నాయి. అవికాస్త సంచలనం అవుతున్నాయి. పైగా మనదేశంలో ఐపీఎల్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఏటికేడు ఈ లీగ్ కు ఆదరణ మరింత పెరుగుతోంది. అందువల్లే యాజమాన్యాలు రకరకాల కసరత్తులు చేస్తున్నాయి. కొత్త ప్లేయర్లను తీసుకోవడం.. బాగా ఆడని ప్లేయర్లను వదిలించుకోవడం.. ఇతర జట్లలో ఆడే ప్లేయర్లను ట్రేడ్ విధానంలో తీసుకోవడం వంటివి చేస్తున్నాయి.
2026 సీజన్ కు ముందు అనేక యాజమాన్యాలు వివిధ రకాల కసరత్తులు చేస్తున్నాయి. అందులో ప్రధానమైనది వివిధ జట్ల ప్లేయర్లను తీసుకోవడం.. తమ దగ్గర ఉన్న ప్లేయర్లను వదిలించుకోవడం.. ఈ విధానాన్ని ముందుగా చెన్నై జట్టు ప్రారంభించింది. లక్నో, ముంబై, కోల్ కతా యాజమాన్యాలు అవలంబిస్తున్నాయి. అయితే ఆ జట్లు కొత్త ప్లేయర్లను తీసుకోగా.. హైదరాబాద్ జట్టు మాత్రం ఒక బౌలర్ ను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇంతవరకు హైదరాబాద్ జట్టు యాజమాన్యం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
2025 సీజన్లో హైదరాబాద్ జట్టు మెగా వేలంలో స్టార్ బౌలర్ మహమ్మద్ షమిని కొనుగోలు చేసింది. అయితే 2025 సీజన్లో అతడు ఆశించిన స్థాయిలో బౌలింగ్ ప్రదర్శన చేయలేదు. దీనికి తోడు దారాళంగా పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు అతడిని వదిలించుకుంటుందని వార్తలు రావడం మొదలైంది. దీనిపై హైదరాబాద్ యాజమాన్యం అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ.. అతడిని కొనుగోలు చేయడానికి లక్నో, ఢిల్లీ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. నవంబర్ 15తో రిటెన్షన్ డెడ్లైన్ ముగిసిపోతుంది. దీంతో హైదరాబాద్ జట్టు షమీని వదులుకోవచ్చని.. తెలుస్తోంది. హైదరాబాద్ జట్టు 10 కోట్లకు షమీని కొనుగోలు చేసింది. 2025 సీజన్లో అతడు ఆరు వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. అయితే మెగా వేలంలో షమీ కోసం లక్నో జట్టు ఏకంగా 8.5 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది. అయితే 10 కోట్లు చెల్లించిన హైదరాబాద్ జట్టు అతడిని దక్కించుకుంది.
షమీ స్టార్ బౌలర్ అయినప్పటికీ.. హైదరాబాద్ జట్టు తరఫున ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం ఆరు వికెట్లు మాత్రమే సాధించాడు. అందువల్లే అతడిని హైదరాబాద్ వదులుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.. మరోవైపు షమీ మీద ఢిల్లీ యాజమాన్యంలో కీలక భాగస్వామిగా ఉన్న గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ప్రకారం చూసుకుంటే షమీ ని ఢిల్లీ జట్టు కొనుగోలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.