Mohammed Nabi: టి20 ఫార్మేట్ లో యువకులు అదరగొడుతుంటారు. ఆకాశమేహద్దుగా చెలరేగిపోతుంటారు. బ్యాటర్లు మాత్రమే కాదు బౌలర్లు కూడా దుమ్మురేపుతుంటారు. అందువల్లే టి20 అంటే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. 2007లో మొదలైన టి20 ఇవాల్టి వరకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అంటే దానికి ప్రధాన కారణం ఈ ఫార్మాట్ లో ఉన్న వేగమే. అయితే ఇలాంటి వేగాన్ని కేవలం యువకులు మాత్రమే కాదని.. నడి వయస్కులు కూడా సాధించగలరని నిరూపించాడు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబి.
79 పరుగులకే ఆరు వికెట్ల కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆఫ్ఘనిస్తాన్.. నబి దూకుడు వల్ల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ముఖ్యంగా చివరి ఓవర్లో వెల్లలగే బౌలింగ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నబి అదరగొట్టాడు. తొలి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత బంతి నో బాల్ అయింది. అనంతరం మిగతా రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. చివరి బంతిని క్విక్ డబుల్ తీయడానికి ప్రయత్నించాడు. అయితే ఒక పరుగు మాత్రమే వచ్చింది. మరో పరుగు తీయడానికి వెళుతుండగా రన్ అవుట్ అయ్యాడు. మొత్తంగా నబి 22 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 60 పరుగులు చేశాడు. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది.
నబీ కి మరొక ఆటగాడి నుంచి గనుక సహకారం లభించి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ స్కోరు మరో విధంగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ 40 సంవత్సరాల వయసులో.. అది కూడా అంతర్జాతీయ టోర్నీలో ఈ స్థాయిలో ఆడటం గొప్ప విషయం. పైగా నబి వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడంలో అంతులేని ఉత్సాహాన్ని ప్రదర్శించాడు. తన శరీర సామర్థ్యాన్ని సరికొత్తగా ప్రదర్శించాడు. క్రికెట్ ఆడాలంటే ఉత్సాహం మాత్రమే ఉండాలని.. దానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించాడు. అయితే ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడం గమనార్హం.
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
– 5 sixes in an over by a 40 year old Mohammad Nabi in Asia Cup 2025. pic.twitter.com/U5cnY0mr3y
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 18, 2025