https://oktelugu.com/

Mitchell Starc : నీది సరిపోలేదు.. కాస్త స్పీడ్ పెంచు.. హర్షిత్ రాణాకు పంచ్ ఇచ్చి బలైన స్టార్క్

చేప కోసం వేసిన కాలం మనకే ఎదురు తిరిగితే.. ఎలా ఉంటుంది.. ఏముంది దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది.. సరిగా ఇలాంటి అనుభవమే ఆస్ట్రేలియా ఆటగాడు స్టార్క్ కు ఎదురైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అనుభవానికి వచ్చింది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 23, 2024 / 09:45 PM IST

    Mitchell Starc-Harshit Rana

    Follow us on

    Mitchell Starc : పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో.. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు అలౌట్ అయింది. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హేజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆల్ అవుట్ అయింది. స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. అది కాస్త ఆస్ట్రేలియా ఆటగాడి అవుట్ కు దారి తీసింది.

    ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో స్ట్రైకర్ గా స్టార్క్ ఉన్నాడు. అప్పుడు హర్షిత్ బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అతడు వేస్తున్న బంతులను ఉద్దేశించి స్టార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ” నీకంటే నేను అత్యంత స్పీడ్ గా బాల్స్ విసురుతాను.. నువ్వు కూడా బాల్స్ అద్భుతంగా వేస్తున్నావు. అయినప్పటికీ నీ కంటే నేనే వేగంగా బౌలింగ్ చేయగలను” అని స్టార్క్ వ్యాఖ్యానించాడు. దానికి హర్షిత్ చిరునవ్వు అయ్యాడు. అయితే స్టార్క్ మరో అడిగే ముందుకు వేసి.. తనకు ఎలా బౌలింగ్ వేయాలో హర్షిత్ కు చెప్పాడు. వేగంగా బంతులను వేయడం మాత్రమే కాకుండా, వాటిని షార్ట్ పిచ్ లాగా సంధించాలని సూచించాడు. ” నాకు అత్యద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని” అని స్టార్క్ పేర్కొన్నాడు. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే స్టార్క్ చివరికి హర్షిత్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు హర్షిత్ ను కొనియాడుతున్నారు. అతడిని స్టార్క్ రెచ్చగొట్టినప్పటికీ జెంటిల్మెన్ తరహాలో రిప్లై ఇచ్చాడని.. అది అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. గొప్ప ఆటను ప్రదర్శించడమే కాకుండా.. హుందాతనాన్ని ఆవిష్కరించాడని.. వివరించారు. అందువల్లే హర్షిత్ అభినందనలకు అర్హుడయ్యాడని వ్యాఖ్యానిస్తున్నారు.

    కాగా, స్టార్క్, హర్షిత్ ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు ఆడారు. హైదరాబాద్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో వీరిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీలక సమయాల్లో వెంట వెంటనే వికెట్లు పడగొట్టి హైదరాబాద్ జట్టుపై కోల్ కతా విజయం సాధించేలాగా చేశారు. అంతేకాదు సుదీర్ఘ విరామం తర్వాత కోల్ కతా జట్టు ఐపిఎల్ విన్నర్ గా ఆవిర్భవించేలా చేశారు. అందుకే స్టార్క్, హర్షిత్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అది పెర్త్ టెస్ట్ ద్వారా మరోసారి నిరూపితమైంది.. అంతేకాదు వారిద్దరి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుని.. సుహ్రుద్భావ వాతావరణాన్ని నెలకొల్పింది.