SA T20 League 2025: ఫైనల్ చేరడం ద్వారా మూడోసారి కూడా ఛాంపియన్ గా నిలవాలని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు భావించింది. అయితే ఆ జట్టు అనుకున్నది ఒకటైతే.. జరిగింది మరొకటి.. ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టును ఎంఐ కేప్ టౌన్ ఓడించింది.. 182 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లు సన్ రైజర్స్ జట్టుకు చుక్కలు చూపించారు.. టామ్ అబెల్ (30), టోనీ డి జోర్జే(26) మాత్రమే పరవాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో కగిసో రబాడ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, లిండే తలా రెండు వికెట్లు సాధించారు. రషీద్ ఖాన్, కార్బన్ బోష్ చెరో వికెట్ సాధించారు..
ఈ మ్యాచ్లో ముందుగా ముంబై జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (15 బంతుల్లో 33), రాస్సీ వాన్ డర్ డుస్సెన్(23) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి తొలి వికెట్ కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. ఎస్టర్ హుజెన్(39), డేవాల్డ్ బ్రెవిస్(38) పరుగులు చేసి అదరగొట్టారు. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్, డాసన్ గ్లీసన్ తలా రెండు వికెట్లు సాధించారు.. మార్ క్రమ్, ఓవర్టన్ చెరో వికెట్ పడగొట్టారు..
ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేయడం.. అంతకుముందు జరిగిన మ్యాచ్లలోనూ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడటంతో.. జాన్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.. జాన్సన్ ఈ టోర్నీలో 13 మ్యాచులు ఆడాడు.. 204 పరుగులు చేశాడు. 18.42 సరాసరితో 19 వికెట్లు పడగొట్టాడు.. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి కప్ అందుకోవాలని సన్ రైజర్స్ జట్టు భావించింది. కానీ ఆటగాళ్లు ఒత్తిడికి గురి కావడంతో ఓటమిపాలైంది. 2024 ఐపిఎల్ లో కోల్ కతా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎలా అయితే తడబడిందో.. 2025 లో జరిగిన SA T20 లీగ్ లో ముంబై జట్టుపై కూడా అలానే ఇబ్బంది పడింది. జట్టు ఫైనల్ లో ఓడిపోవడంతో కావ్య మారన్ నిర్వేదానికి గురైంది. బుంగమూతి పెట్టుకొని నిరాశ చెందింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు తన తండ్రి కళానిధి మారన్ తో హాజరైంది..
HISTORY WRITTEN IN GOLD! @MICapeTown reign supreme as the new Betway SA20 champions! What a season, what a final!#BetwaySA20Final #MICTvSEC #WelcomeToIncredible pic.twitter.com/UQPoK3fCNN
— Betway SA20 (@SA20_League) February 8, 2025