Homeక్రీడలుక్రికెట్‌MayathiLanger Virat Kohli Request : నమ్మలేకపోతున్నాను విరాట్.. కొంచెం నన్ను ముట్టుకోనివ్వండి: మాయతిలాంగర్

MayathiLanger Virat Kohli Request : నమ్మలేకపోతున్నాను విరాట్.. కొంచెం నన్ను ముట్టుకోనివ్వండి: మాయతిలాంగర్

MayathiLanger Virat Kohli Request : కన్నడ జట్టు సాధించిన ఐపిఎల్ విజయం.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రధాన మీడియాలో విపరీతమైన చర్చకు కారణమవుతోంది. ఇక సెలబ్రిటీలు అయితే తమ విజయం గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.MayathiLanger Virat Kohli Request  : ఎప్పుడైతే బెంగళూరు అయ్యర్ జట్టు పై విజయం సాధించిందో.. అప్పటినుంచి సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. విరాట్ కోహ్లీ నుంచి మొదలు పెడితే పాటిదార్ వరకు ప్రేక్షకుల నుంచి వస్తున్న అభినందనలతో తడిసి ముద్దవుతున్నారు. కన్నడ జట్టు విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ ఏకంగా చిన్న పిల్లాడు అయిపోయాడు. మైదానంలో అలా పడుకుని పోయి ఏడ్చేసాడు. తోటి ఆటగాళ్లు విరాట్ కోహ్లీ సముదాయించారు. భావోద్వేగాన్ని నియంత్రించుకో అంటూ భుజం తట్టారు. విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క అతడిని ఆలింగనం చేసుకొని మొత్తానికి సాధించావంటూ భుజం తట్టి అభినందించింది.. ఆ ఆప్యాయతలో.. ఆ ఆత్మీయ పలకరింపుతో విరాట్ కోహ్లీ ఒక్కసారిగా సాంత్వనకు గురయ్యాడు. 18 సంవత్సరాలుగా మోస్తున్న బరువును ఒక్కసారిగా దించుకున్నాడు. ఇక ఈ విజయం బెంగళూరు జట్టు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Also Read : 18 ఏళ్ల నిరీక్షణకు ‘18’తోనే అద్భుత ముగింపు..విరాట్ కు కలిసొచ్చిన నంబర్ 18 హిస్టరీ

బెంగళూరు సాధించిన విజయం నేపథ్యంలో ఆటగాళ్ల నుంచి మొదలు పెడితే అభిమానుల వరకు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇందులో ప్రముఖ స్పోర్ట్స్ వ్యాఖ్యాత మాయాతిలాంగర్ కూడా ఒకరు. బెంగళూరు ట్రోఫీ అందుకున్న తర్వాత.. ఆ ట్రోఫీ విరాట్ కోహ్లీ చేతుల్లోకి వచ్చిన తర్వాత.. లాంగర్ భావదేగానికి గురైంది. సాధించిన ట్రోఫీని మైదానంలో నాలుగు మూలల తీసుకెళ్తూ విరాట్ కోహ్లీ అభిమానులకు చూపించాడు. ఆ సమయంలో మైక్రోఫోన్లో మాయాతిలాంగర్ ఒక అభ్యర్థన చేసింది..” నా భర్త స్టువర్ట్ బిన్నీ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016 చివరి అంచె పోటీలో ప్రాతినిధ్యం వహించాడు. కానీ అది నాకు అత్యంత చేదు జ్ఞాపకాన్ని అందించింది. నేను కన్నడ ఆడపడుచును.. విరాట్.. ప్లీజ్ రిక్వెస్ట్.. నాకు ఆ ఐపిఎల్ ట్రోఫీని టచ్ చేసే అవకాశం ఇవ్వు.. ఇది నిజమని.. యదార్థంలో ఉన్నానని.. నా చుట్టూ జరుగుతోంది వాస్తవమని నేను గ్రహించలేకపోతున్నానని” మయాతి కన్నీటి పర్యంతమౌతూ వ్యాఖ్యలు చేసింది. ” నా సొంత జట్టు కప్ గెలవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అనేక సందర్భాలలో నా మనో గతాన్ని బయటపెట్టాను. ఎప్పుడూ నా కల వాస్తవరూపం దాల్చలేదు.. చివరికి ఇన్నాళ్లకు అది నెరవేరింది. నా జట్టు విజయం సాధించింది. ఇది నాకు గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి సందర్భం నిజమైనందుకు ఆనందంగా ఉందని” మాయాతీ పేర్కొంది.

మాయాతి చేసిన వ్యక్తులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. కన్నడ ఇంటి ఆడపడుచు అయిన మాయాతి అనేక సందర్భాల్లో విరాట్ కోహ్లీకి అనుకూలంగా మాట్లాడింది. కాకపోతే అవన్నీ కూడా ఆఫ్ ది రికార్డు. కన్నడ జట్టు గెలవాలని కోరుకుంది. ఇన్నాళ్లకు ఆమె ప్రార్థనలు ఫలించాయి. ఆమె పూజలు కార్యరూపం దాల్చాయి. మొత్తానికి కన్నడ జట్టుకు 18 సంవత్సరాల సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత ఐపీఎల్ ట్రోఫీని అందించాయి.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version