https://oktelugu.com/

Rahul Dravid: టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పనితీరుతో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి..?

Rahul Dravid: టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియామకం అయిన తరువాత భారత్ జట్టు న్యూజిలాండ్ తో సిరీస్ ను గెలుచుకుంది. దీంతో అటు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ ద్రవిడ్ పైన అంచనాలు పెరిగాయి. వీరిద్దరి కాంబినేషన్లో జట్టు విజయం సాధించగలిగిందని అంటున్నారు. అయితే ద్రవిడ్ కోచ్ గా మారిన తరువాత టీమిండియాలో అనేక మార్పులు జరిగాయని, ఇది ముందు ముందు ఉపయోగపడుతుందని అంటున్నారు. దీంతో ద్రవిడ్ రానున్న కాలంలో ఇండియాకు మరిన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2021 / 09:20 AM IST
    Follow us on

    Rahul Dravid: టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియామకం అయిన తరువాత భారత్ జట్టు న్యూజిలాండ్ తో సిరీస్ ను గెలుచుకుంది. దీంతో అటు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ ద్రవిడ్ పైన అంచనాలు పెరిగాయి. వీరిద్దరి కాంబినేషన్లో జట్టు విజయం సాధించగలిగిందని అంటున్నారు. అయితే ద్రవిడ్ కోచ్ గా మారిన తరువాత టీమిండియాలో అనేక మార్పులు జరిగాయని, ఇది ముందు ముందు ఉపయోగపడుతుందని అంటున్నారు. దీంతో ద్రవిడ్ రానున్న కాలంలో ఇండియాకు మరిన్ని విజయాలు తెచ్చిపెట్టగలడా..? అని చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆయన నిర్వహించిన బాధ్యతలన్నింటిలోనూ మంచిపేరే తెచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు కూడా సక్సెస్ అవుతారని అంటున్నారు. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న టీమిండియాను ద్రవిడ్  గట్టెక్కించగలడా అన్న దానిపై విశ్లేషణ.

    rahul-dravid-dhawan

    టీమిండియా జట్టులో చోటు సంపాదించిన రాహుల్ ద్రవిడ్ దూకుడు లేకపోయినా జట్టును విజయం దిశగా తీసుకెళ్లిన రోజులు చాలానే ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో వరుసగా వికెట్లో కోల్పోయినప్పుడు ద్రవిడ్ బరిలోకి దిగడంతో ఇక వికెట్లు నిలుస్తాయన్న ధీమా ఉండేది. సచిన్ టెండూల్కర్ తన బ్యాటింగ్ తో వీరవిహారం చేస్తుండగా.. ద్రవిడ్ స్థిరత్వాన్ని అందించేవారు. అంటే బలమైన బాడీ లాంగ్వేజ్, ఆడంబరం చేయడమంటే ద్రవిడ్ కు ఇష్టముండదు. కానీ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్ మెన్ గా ద్రవిడ్ తన మార్కు చూపించాడు. ఆ తరువాత కెప్టెన్ గాను ద్రవిడ్ అత్యుత్తమ ప్రతిభ చూపించాడు.

    ఆ తరువాత టీవీ కామెంటరీగానూ ద్రవిడ్ మంచి మార్కులే కొట్టేశారు. విదేశీయులతో పోటీ పడి తన ఉచ్చరణతో అందరినీ తన మాటలతో ఆకట్టుకునేవాడు. ఇప్పటికీ బ్రాడ్ కాస్టర్ల నుంచి ద్రవిడ్ కు మంచి డిమాండ్ ఉంది. కానీ అవన్నీ కాదనుకొని ఇండియా ఏ జట్టు కు శిక్షణ ఇచ్చేందుకు వచ్చారు. ఆ తరువాత అండర్ 19 ఆటగాళ్లకు కోచ్ గా మారారు. ప్రస్తుతం టీమిండియా జట్టుకు ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు. అయితే రవిశాస్త్రి కోచ్ గా మారకముందే ద్రవిడ్ ను నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో ద్రవిడ్ ఆ పదవి చేపట్టడానికి ముందుకు రాలేదు.

    భారత చీఫ్ కోచ్ గా ద్రవిడ్ ను నియమించడంతో భారత ఆటగాళ్లలో ఉత్సాహం నెలకొంది. వారు అనుకున్న విధంగానే న్యూజిలాండ్ సిరీస్ ను భారత్ గెలుచుకుంది. భారత జట్టుకు ఇప్పటి వరకు జాన్ రైట్, గ్యారీ కిర్ స్టన్, రవిశాస్త్రిలో విజయవంతంగా తమ బాధ్యతలను నిర్వహించారు. ఇప్పుడు అయితే అనిల్ కుంబ్లే పదవీకాలం తక్కువే అయినా వివాదంతో ముగిసింది. భారత్ కోచ్ అంటే ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సాంకేతిక అంశాలను తీర్చిదిద్దడం, మ్యాచ్ పరిస్థితులను నిర్ధిష్టమైన అవగాహన కలిగి ఉండడం, పనిభారం మోయడం, క్రికెటర్ల నుంచి మంచి ఆటను రాబట్టుకోవడం లాంటివి చేయాలి.

    ప్రస్తుతం ద్రవిడ్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు టీం ఇండియాకు టెస్టులు, వన్డేలకు విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉన్నారు. టీ20లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు కెప్లెన్లు ఉండడంతో డ్రెస్సింగ్ రూంలో వారితో సున్నితంగా మెలగాల్సిన అవసరం ఉంది. ఇక వరుస ఓటమిలతో టీమిండియా నిరాశతో ఉంది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ కనీసం సెమీఫైనల్ కు వెళ్లకుండా తిరిగి రావడంతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సిరీసుల్లో మంచి ప్రతిభ చూపిస్తున్నా వరల్డ్ కప్ మ్యాచులకొచ్చేసరికి ఢీలా పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులను చక్కబెట్టే బాధ్యత ద్రవిడ్ పైనే ఉంది. మరి ఆయన వీటిని ఎలా ఎదుర్కొంటాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు.