Mahendra Singh Dhoni: పాకిస్తాన్ తో ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించాలంటూ.. భారత సైన్యానికి తోడ్పాటు అందించాలంటూ ప్రాదేశిక సైన్యానికి వర్తమానం అందింది. దీనికి సంబంధించి కేంద్ర డిఫెన్స్ మినిస్టరీ స్పెషల్ గెజిట్ రిలీజ్ చేసింది. ప్రాదేశిక సైన్యం సేవలను ఉపయోగించుకోవడానికి మన దేశ సైనిక అధ్యక్షుడికి పూర్తిస్థాయిలో అథారిటీ ఉందని ఆ వర్తమానంలో వెల్లడించింది. సైన్యానికి అడిషనల్ గా ఉంటూ.. ప్రాదేశిక సైన్యం చేయూత అందించాలంటూ ఆ వర్తమానంలో వివరించింది.. ప్రాదేశిక సైన్యం ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలోనూ మన దేశ సైన్యానికి తన వంతుగా తోడ్పాటు అందించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రాదేశిక సైన్యం తనవంతుగా సైన్యానికి తోడ్పాటు అందించనుంది. ఆపరేషన్ పరాక్రమ్, కార్గిల్ వార్ సమయంలో ప్రాదేశిక సైన్యం భారత దళాలకు తన వంతుగా తోడ్పాటు అందించింది. ఇక ప్రాదేశిక సైన్యంలో మన దేశానికి సంబంధించిన అనేకమంది ప్రముఖులు ఉన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ జాబితాలో టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోని, కపిల్ దేవ్ వంటి వారు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలెట్ కూడా ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదాలో ఉన్నారు. ప్రాదేశిక సైన్యం అంటే వాలంటరీ సివిలియన్స్ తో కూడిన ఒక సోల్జర్ ఆర్గనైజేషన్. వీరు దేశానికి అత్యవసరమైన పరిస్థితుల్లో.. సర్వీస్ చేయడానికి ముందుకు వస్తారు. ఆ సర్వీస్ చేయడంలో ముందుగానే ట్రైన్ అవుతారు.
Also Read: మా డిఫెన్స్ వ్యవస్థ అంతా డొల్ల.. అంగీకరించిన పాకిస్థాన్ రక్షణ మంత్రి.. వీడియో వైరల్!
గతంలో కాశ్మీర్లో విధులు
మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం టీమిండియా మాజీ కెప్టెన్ గా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఐపిఎల్ సీజన్లో చెన్నై జట్టుకు తాత్కాలిక సారధిగా కొనసాగుతున్నారు. మహేంద్ర సింగ్ ధోనీకి 2011లో భారత ప్రాదేశిక సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ తో గౌరవించింది. క్రికెట్ కు, మరీ ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ కు ధోని చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనకు ఈ గౌరవాన్ని అందించింది. లెఫ్టినెంట్ హోదా లభించడంతో మహేంద్రసింగ్ ధోని పారాట్రూపర్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ ట్రైనింగ్లో ఎలిజిబిలిటీ కూడా సంపాదించాడు. 2019లో ధోని ఆధ్వర్యంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత.. ధోని మరో మాటకు తావు లేకుండా తన బెటాలియన్తో కలిసి కాశ్మీర్ వెళ్లిపోయాడు. కాశ్మీర్ లోయలో దాదాపు 15 రోజులపాటు డ్యూటీ చేశాడు. కొద్దిరోజులపాటు పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ వంటి విధుల్లో పాల్గొన్నారు. ధోని అభ్యర్థన మేరకు ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆ విధులు నిర్వహించడానికి అనుమతి వచ్చింది.
గతంలో కపిల్ దేవ్ కూడా
గతంలో టీం ఇండియా లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదాను కలిగి ఉన్నారు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ధోనీ ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న నేపథ్యంలో.. పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో పనిచేయడానికి పిలుపు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కపిల్ దేవ్ కూడా భారత ప్రాథమిక సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలెట్ కూడా ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్ హోదాలో కొనసాగుతున్నారు. అయితే ఆయన నార్మల్ ఆఫీసర్ గానే ఇందులో ఎంట్రీ ఇచ్చారు. దానికి కావలసిన ట్రైనింగ్ ఆయన తీసుకున్నారు. అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో .. సచిన్ పైలట్.. మహేంద్ర సింగ్ ధోని.. కపిల్ దేవ్ కు ప్రాదేశిక సైన్యం ద్వారా సేవలు అందించాలని పిలుపు రావచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.