https://oktelugu.com/

Deepak Hooda: లక్కీ దీపక్ హుడా.. అతడుంటే టీమిండియా గెలిచినట్టే.. వరుసగా 16వ విజయం

Deepak Hooda: ఏ ఆటలోనైనా కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. దీంతో వారు ఎన్ని చేసినా కలిసి రాదు. అదృష్టం ఉంటే మట్టిని పట్టుకున్నాబంగారం అవుతుంది. అలాంటి యోగమే ప్రస్తుత క్రికెట్ టీంలో దీపక్ హుడాకు పట్టింది. అతడు ప్రాతినిధ్యం వహించిన అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా విజయాలు సాధించడంతో ఇండియాకు దొరికిన మరో ఆణిముత్యం అని కొనియాడుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 16 మ్యాచుల్లో అతడు ఉన్నందున విజయం దక్కిందని తెలుస్తోంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 21, 2022 / 12:04 PM IST
    Follow us on

    Deepak Hooda: ఏ ఆటలోనైనా కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. దీంతో వారు ఎన్ని చేసినా కలిసి రాదు. అదృష్టం ఉంటే మట్టిని పట్టుకున్నాబంగారం అవుతుంది. అలాంటి యోగమే ప్రస్తుత క్రికెట్ టీంలో దీపక్ హుడాకు పట్టింది. అతడు ప్రాతినిధ్యం వహించిన అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా విజయాలు సాధించడంతో ఇండియాకు దొరికిన మరో ఆణిముత్యం అని కొనియాడుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా 16 మ్యాచుల్లో అతడు ఉన్నందున విజయం దక్కిందని తెలుస్తోంది. దీంతో అతడి రాక జట్టుకు ఎంతో మేలు చేస్తోందని విశ్వసిస్తున్నారు.

    Deepak Hooda

    టీమిండియా ప్రస్తుతం జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో రెండు వన్డేల్లో ఇప్పటికే విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. ఇక మూడో వన్డే మిగిలి ఉంది. ఇందులో కూడా గెలిచి జింబాబ్వేను వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో కేఎల్ రాహుల్ సారధ్య బాధ్యతలు తీసుకున్నాడు. కెప్టెన్ గా రాహుల్ కు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం. దీంతో ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టీమిండియాకు ఎదురే లేకుండా పోయింది. సమష్టిగా ఆడి విజయాలు అందుకుంటోంది.

    Also Read: Pawan Kalyan: పదవుల కోసం కాదు.. మార్పు కోసం ప్రాణాలిస్తానంటున్న పవన్..

    జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. టీమిండియా జట్టులో దీపక్ హుడా పాల్గొన్న అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించడంతో ఓ ప్రపంచ రికార్డు సాధించింది. టీమిండియా ఆడిన 16 మ్యాచుల్లో (టీ20, వన్డేలు కలిపి) విక్టరీ సాధించడంతో ఈ ఘనత సొంతమైంది. దీపక్ హుడా ఆడిన అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించడం గమనార్హం. దీంతో గతంలో రుమేనియా ఆటగాడు సాట్విక్ నడిగోటియా పేరిట ఉండేది. దాన్ని దీపక్ హుడా బద్దలు కొట్టడంతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.

    Deepak Hooda

    జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచులో 25 పరుగులు చేశాడు. బౌలింగ్ లో రెండు ఓవర్లు వేసి ఆరు పరుగులు ఇచ్చి కీలకమైన విలియమ్సన్ వికెట్ పడగొట్టాడు. దీంతో జింబాబ్వే పతనం ఖాయమైంది. దీంతో దీపక్ హుడాను లక్ లెగ్ గా పరిగణిస్తున్నారు. అతడు జట్టులో ఉండటం అదృష్టంగా భావిస్తున్నారు. దీపక్ హుడా ఉంటే టీమిండియాకు తిరుగులేకుండా పోతోంది. అందుకే భవిష్యత్ లో కూడా అతడిని జట్టులో ఉంచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తుందని తెలుస్తోంది.

    Also Read:CPI Supports To TRS: సూది, దబ్బుణం పార్టీలు ఇక మారవ?

     

     

    Tags