Kuldeep Yadav: రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా గెలుపు బాటలో పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 445, రెండవ ఇన్నింగ్స్ లో 430_4 (డిక్లేర్) పరుగులు చేసిన టీమిండియా ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశాఖపట్నం టెస్టులో డబుల్ సెంచరీ తో మెరిసిన టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్.. రాజ్ కోట్ లోనూ సత్తా చాటాడు. 14 ఫోర్లు, 12 సిక్స్ లతో 214 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు కాబట్టి సరిపోయింది.. లేకుంటే అతడు త్రిబుల్ సెంచరీ చేసేవాడు. ఇక ఆదివారం నాటి టీం ఇండియా ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్, సర్ఫ రాజ్ తర్వాత ఆ స్థాయిలో కాకపోయినప్పటికీ నైట్ వాచ్మెన్ కులదీప్ యాదవ్ ఆకట్టుకున్నాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆదివారం ఇన్నింగ్స్ మొదలైన తొలి గంట వరకు గిల్ తో కలిసి స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 91 బంతుల్లో 27 పరుగులు చేసి కులదీప్ అవుట్ అయ్యాడు. అయితే అతడి ఇన్నింగ్స్ లో ఒక షాట్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
196/2 తో టీమిండియా ఆదివారం ఇన్నింగ్స్ ప్రారంభించింది. నైట్ వాచ్ మెన్ కులదీప్ యాదవ్, గిల్ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ
నాలుగవ వికెట్ కు 55 పరుగులు జోడించారు. టీమిండియా ఇంగ్లాండ్ పై సాధించిన ఆధిక్యంలో తమ వంతు పాత్ర పోషించారు. గిల్ దూకుడుగా ఆడుతుంటే.. కుల దీప్ యాదవ్ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అర్థ సెంచరీ చేయలేకపోయాడు కానీ.. ఆదివారం నాటి ఇన్నింగ్స్ తొలి గంట వరకు గిల్ తో కలిసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. 91 బంతుల్లో 27 పరుగులు చేసి కులదీప్ అవుట్ అయ్యాడు.
అయితే అతడి ఇన్నింగ్స్ లో కొట్టిన ఒక సిక్స్ ఎప్పటికీ నిలిచిపోతుంది. టామ్ హర్ట్ లీ బౌలింగ్లో కులదీప్ యాదవ్ లాంగ్ ఆన్ లో భారీ సిక్సర్ బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో కులదీప్ యాదవ్ కు ఇదే తొలి సిక్స్. ఇంతకుముందు అతడు వన్డే, టి 20 ఫార్మాట్ లలో ఎప్పుడూ సిక్స్ కొట్టలేదు. ఇక కులదీప్ యాదవ్ ఇటీవల కాలంలో బౌలర్ గా మాత్రమే కాకుండా బ్యాటర్ గానూ రాణిస్తున్నాడు. కీలక సమయంలో తన వికెట్ కాపాడుకుంటూనే.. తోటి బ్యాటర్ కు తోడ్పాటు అందిస్తున్నాడు. ఏడు సంవత్సరాల సుదీర్ఘ కెరియర్లో అతడు తొలి సిక్స్ ఇంగ్లాండ్ జట్టు పై సాధించడం విశేషం.
That was a – shot for a six!
That’s how your first 6️⃣ in international cricket should be! #INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/zFXu8SZkRp
— JioCinema (@JioCinema) February 18, 2024