https://oktelugu.com/

Virat Kohli Vs Kane Williamson: కేన్ విలయంసన్ వికెట్ తీసిన కోహ్లీ.. కానీ ఇప్పుడు కాదు.. ఈసారి ఏం జరుగనుంది..?

2008 ఫిబ్రవరి 27వ తేదీన కౌలలం పుర్ వేదిక గా జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా న్యూజిలాండ్ పైన ఘన విజయం సాధించడం జరిగింది.ఇక ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే న్యూజిలాండ్ కెప్టెన్ అయిన విలియమ్ సన్ వికెట్ ని ఇండియన్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ తీశాడు.

Written By: , Updated On : November 15, 2023 / 02:35 PM IST
Virat Kohli Vs Kane Williamson

Virat Kohli Vs Kane Williamson

Follow us on

Virat Kohli Vs Kane Williamson: ప్రపంచ క్రికెట్ చరిత్రలో వరల్డ్ కప్ కి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి టీం కూడా వాళ్ల టీం తరఫున వీలైనంత ఎక్కువసార్లు ఈ కప్పును గెలుచకోవాలనే చూస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఇండియన్ టీం కూడా ప్రస్తుతం సెమీ ఫైనల్ లో అడుగుపెట్టి ఒక గొప్ప విక్టరీ కొట్టడానికి రెడీ అయింది.ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ లో కూడా ఇండియా న్యూజిలాండ్ టీం లు పోటీ పడ్డాయి. అప్పుడు ఇండియా టీం తరఫున విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండగా, న్యూజిలాండ్ తరఫున విలియం సన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ రెండు టీములు సెమీఫైనల్ లో తలపడ్డాయి…

2008 ఫిబ్రవరి 27వ తేదీన కౌలలం పుర్ వేదిక గా జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా న్యూజిలాండ్ పైన ఘన విజయం సాధించడం జరిగింది.ఇక ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే న్యూజిలాండ్ కెప్టెన్ అయిన విలియమ్ సన్ వికెట్ ని ఇండియన్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ తీశాడు. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లను కోల్పోయి 205 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో విలియమ్ సన్ ఇండియన్ బౌలర్లను అద్బుతం గా ఎదురుకుంటు వచ్చాడు.

ఇక ఇలా కాదని కోహ్లీ రంగం లోకి దిగి స్వయంగా ఆయనే బౌలింగ్ చేసి 37 పరుగులు చేసిన విలియమ్ సన్ వికెట్ తీశాడు. ఇక విలియమ్ సన్ తో పాటు గా 32 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కొల్సన్ ని కూడా కోహ్లీ ఔట్ చేశాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ అయిన విలియమ్ సన్ వికెట్ మన కెప్టెన్ అయిన కోహ్లీ తీయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక వర్షం కారణం గా ఆ మ్యాచ్ ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం 191 పరుగులకు కుదించడం జరిగింది.. ఇక ఇండియన్ బ్యాట్స్ మెన్స్ లో విరాట్ కోహ్లీ 43 పరుగులు చేయగా, శ్రీవత్సవ గోస్వామి 51 పరుగులు చేసి ఇండియన్ టీమ్ తరుపున ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ ని సాధించాడు…ఇక ఈ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించడం జరిగింది…ఇక 43 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది…

ఇక ఈరోజు ఈ రెండు టీమ్ లా మధ్య 2023 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగటం తో అభిమానులు అందరూ కూడా ఇవాళ్ళ కోహ్లీ బౌలింగ్ వేస్తే మళ్ళీ విలియమ్ సన్ ఔట్ అయి పోతాడంటు సోషల్ మీడియా లో అండర్ 19 సెమీ ఫైనల్ మ్యాచ్ ని గుర్తు చేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు…ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది…