Homeక్రీడలుక్రికెట్‌KL Rahul: కేఎల్‌.రాహుల్‌ సంచలన నిర్ణయం.. వైరల్‌ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు.. అసలు ఏమైందంటే?

KL Rahul: కేఎల్‌.రాహుల్‌ సంచలన నిర్ణయం.. వైరల్‌ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు.. అసలు ఏమైందంటే?

KL Rahul: క్రికెట్‌లో రిటైర్మెంట్లు సాధారణం. అయితే మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు జట్టులో స్థానం దక్కక రిటైర్మెంట్‌ కావడం చర్చనీయాంశం అవుతుంది. అప్పట్లో వీవీఎస్‌ లక్ష్మణ్, అంబటి రాయుడు వంటి తెలుగు క్రికెటర్లు వివాదాస్పదంగానే రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఇక సచిన్, ధోనీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు మాత్రం వయసు, ఫిట్‌నెస్‌ కారణంగా క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత రోహిత్‌ శర్మ, కోహ్లి కూడా ఇక ఆడలేమని టిరైర్మెంట్‌ ప్రకటించారు. తాజాగా ఓ భారత క్రికెటర్‌ కూడా రిటైర్మెంట్‌ ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే తాను ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇప్పుడది నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. దీంతో ఆయన చేసే ప్రకటన రిటైర్మెంట్‌ గురించే అని అంతా చర్చించుకుంటున్నారు. టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ అండ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ చాలా కాలం తర్వాత మళ్లీ టీమ్‌ ఇండియాలో కనిపించాడు. 2024 ఐపీఎల్‌ సమయంలో గాయపడిన రాహుల్‌ కోలుకున్న తర్వాత శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా తరఫున ఆడాడు. కానీ లంకతో జరిగిన సిరీస్‌లో రాహుల్‌ ప్రదర్శన అంతంత మాత్రమే. దీంతో మూడో వన్డే నుంచి రాహుల్‌ను జట్టు నుంచి తప్పించారు. లంకతో సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన రాహుల్‌కు మళ్లీ భారత జట్టులో చోటు దక్కాలంటే చాలా కష్టపడాలంటున్నారు క్రికెట్‌ నిపుణులు.

సోషల్‌ మీడియాలో పుకారు..
ప్రస్తుతం జట్టులో స్థానం దక్కించుకోవడం అంత ఈజీ కాదు. కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేఎల్‌.రాహుల్‌ గురించి సోషల్‌ మీడియాలో ఒక పుకారు మొదలైంది. కేఎల్‌ రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్‌లో రాహుల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు ఉంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ‘చాలా ఆలోచించిన తర్వాత, ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌ నా జీవితంలో ముఖ్యమైన భాగమైనందున ఈ నిర్ణయం అంత సులభం కాదు. నా కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులు, సహచరులు అభిమానులకు కృతజ్ఞతలు. మైదానంలోనూ, బయటా నేను పొందిన అనుభవాలు జ్ఞాపకాలు నిజంగా వెలకట్టలేనివి. నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నాను. చాలా మంది ప్రతిభావంతులైన దిగ్గజ క్రికెటర్లతో ఆడినందుకు సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని రాసి ఉంది.

ముందు ఓ ప్రకటనతో వస్తున్నా..
ఇదిలా ఉంటే.. కేఎల్‌ రాహుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్‌ చేశాడు . ‘ఇవాళ ఒక ప్రకటనతో వస్తున్నాను..వేచి ఉండండి’ అని అందులో పేర్కొన్నాడు. అయితే అది అంతర్జాతీయ క్రికెట్‌ రిటైర్మెంట్‌ కు సంబంధించినది కాదు. కానీ ఈ పోస్ట్‌ను కొందరు నెటిజన్లు వేరేలా ప్రచారం చేస్తున్నారు. రాహుల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు సోషల్‌ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. ఈ ప్రకటన అతని క్రికెట్‌ భవిష్యత్తుతో పూర్తిగా సంబంధం లేనిది అయినప్పటికీ, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్‌లో కేఎల్‌.రాహుల్‌ లక్నో సూపర్‌ జెయిట్స్‌కు కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా ఉన్నారు. అయితే వచ్చే ఐపీఎల్‌లో లక్నో జట్టు యాజమాన్యం అతడిని తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ ఐపీఎల్‌పై ప్రకటన చేయబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రాహుల్‌ క్రికెట్‌ కెరీర్‌ ఇలా..
2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కేఎల్‌ రాహుల్‌ ఇప్పటివరకు టీమ్‌ ఇండియా తరఫున 50 టెస్టులు, 77 వన్డేలు, 72 టీ20లు ఆడాడు. ఇందులో రాహుల్‌ టెస్టుల్లో 2,863 పరుగులు, వన్డేల్లో 28,51 పరుగులు, టీ20ల్లో 2,265 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే రాహుల్‌ ఐపీఎల్‌ తదుపరి ఎడిషన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఆడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular