KL Rahul Captain: టెస్టుల్లో టీమ్ ఇండియా ఆట తీరు ఏమాత్రం బాగోలేదు. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కూడా టీమిండియా ఓడిపోయింది. టి20 లో మాత్రమే టీమిండియా ఓటమి అనేది లేకుండా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. 2024లో టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఇప్పటివరకు టీమ్ ఇండియా పొట్టి ఫార్మాట్లో ఓటమి అనేది లేకుండా దూసుకుపోతోంది.
సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ ఇండియా ఆట తీరు ఏమాత్రం బాగోలేదు.. చివరికి స్వదేశం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న సిరీస్ లో భారత్ అత్యంత దరిద్రంగా ఆడుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్ టీమిండియా ఓడిపోయింది. రెండవ టెస్ట్ లో ఎదురీదుతోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా.. 3 వన్డేల సిరిస్ ఆడుతుంది. ఈ సిరీస్ కోసం టీం ఇండియాను ఎంపిక చేశారు.. వన్డే జట్టు కెప్టెన్ గిల్ గాయపడ్డాడు. వైస్ కెప్టెన్ అయ్యర్ కూడా గాయపడిన నేపథ్యంలో జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను సారధిగా నియమించారు. పంత్ కు ఉపసారద్య బాధ్యతలు అప్పగించారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు జట్టులో చోటు లభించింది. ప్రమాదకరమైన జైస్వాల్ రోహిత్ తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు.. బ్యాకప్ ఓపెనర్ గా రుతు రాజ్ గైక్వాడ్ జట్టులోకి వచ్చాడు. రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ కు కూడా జట్టులో చోటు లభించింది.. మొత్తంగా సీనియర్లు, జూనియర్ల కలయికతో జట్టుకు రూపకల్పన చేసింది మేనేజ్మెంట్.
మొదటి వన్డే నవంబర్ 30న రాంచీలో, రెండవ వన్డే డిసెంబర్ 3న రాయ్ పూర్, మూడవ వన్డే డిసెంబర్ 6 విశాఖపట్నంలో జరుగుతాయి. కేఎల్ రాహుల్ ఎంపిక బాగుందని.. అతడు జట్టను స్థిరీకరిస్తాడని అభిమానులు పేర్కొంటున్నారు. అతడు సమతౌల్యంగా ఉంటాడని.. వివాదాస్పద నిర్ణయాల జోలికి వెళ్లడని పేర్కొంటున్సారం వన్డేలలో ధోని, రోహిత్, విరాట్ నాయకత్వంలో టీమిండియా ఎలా అయితే విజయాలు సాధించిందో.. రోహిత్ కు వన్డే పగ్గాలు అందిస్తే అదే స్థాయిలో గెలుపులు దక్కించుకుంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ తనను తాను నిరూపించుకోవడానికి ఈ టోర్నీ ఉపయోగపడుతుందని అభిమానులు పేర్కొంటున్నారు. భవిష్యత్ కాలంలో ఎదురయ్యే సవాళ్లకు రాహుల్ ఈ సిరీస్ ద్వారా సమాధానం చెప్పే సామర్థ్యాన్ని సాధిస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.
వన్డే ఫార్మాట్లో టీమ్ ఇండియాకు సారధిగా గిల్ కొనసాగుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే అతడు గాయపడిన నేపథ్యంలో.. ఆ స్థానాన్ని రాహుల్ తో మేనేజ్మెంట్ భర్త చేసింది. తనను కెప్టెన్ గా నియమించడం పట్ల రాహుల్ సంతృప్తితో ఉన్నాడు. ఒకవేళ మైదానంలో అతడు అద్భుతంగా తన నాయకత్వాన్ని ప్రదర్శిస్తే.. అప్పుడు మేనేజ్మెంట్ ఆలోచన కూడా మారుతుందని.. వన్డేల బాధ్యతలు రాహుల్ కు అప్పగించే అవకాశం ఉంటుందని మాజీ క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.