KL Rahul: క్లాసులో మాస్ అనే పదం సినిమా నటులు చెబితే వింటుంటాం కదా. ఇది కూడా అలాంటిదే.. కాకపోతే దాన్ని క్రికెట్లో నిజం చేసి చూపించినవాడు కేఎల్ రాహుల్ (KL Rahul). బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో.. అజేయంగా 93 పరుగులు చేసి.. ఢిల్లీ జట్టును గెలిపించాడు కేఎల్ రాహుల్.
Also Read: ఐపీఎల్ లో మెయిడిన్ ఓవర్.. వికెట్ కూడానా.. ఎవరు భయ్యా నువ్వు?
సొంతమైదానం బెంగళూరులో కేఎల్ రాహుల్ రెచ్చిపోతాడు. ఎందుకంటే అతడు క్రికెట్ ఓనమాలు దిద్దింది ఆ మైదానంలోనే కాబట్టి. అందరికీ ఆ మైదానం అంటే కొట్టిన పిండి.. గురువారం ఈ మైదానంలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 164 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ జట్టు ముందు ఉంచింది. అయితే దీనిని చేజ్ చేసే క్రమంలో ఢిల్లీ జట్టు కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 53 బంతుల్లో 93 పరుగులు చేశాడు. ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లు కొట్టాడు. స్టబ్స్(38*) తో కలిసి ఐదో వికెట్ కు 111* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముఖ్యంగా తన బ్యాటింగ్ పవర్ తో చిన్నస్వామి స్టేడియాన్ని కేఎల్ రాహుల్ హోరెత్తించాడు. అయితే ఈ మైదానంలో తనకు మాత్రమే సాధ్యమైన రికార్డును కేఎల్ రాహుల్ నెలకొల్పాడు.
475 పరుగులు
2013 నుంచి 2025 ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు కేఎల్ రాహుల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 18 మ్యాచ్లు ఆడాడు. 15 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. ఇందులో అతడి అత్యధికమైన వ్యక్తిగత స్కోర్ 93* పరుగులు.. యావరేజ్ 43.18, స్ట్రైక్ రేట్ 143.93, ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.. 40 బౌండరీలు ఉన్నాయి. 22 సిక్సర్లు ఉన్నాయి. ఇంత ఘనత ఉంది కాబట్టే బెంగళూరు మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కేఎల్ రాహుల్ తాండవం చేశాడు. బ్యాట్ చేత పట్టుకొని బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదర్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నప్పటికీ.. ఏ ఎల్ రాహుల్ ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. పైగా తనకు మాత్రమే సాధ్యమైన కళాత్మకమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. అదును చూసి ఢిల్లీ జట్టును దెబ్బ కొట్టాడు. మొత్తంగా సొంత మైదానంలో.. భారీగా హాజరైన బెంగళూరు ప్రేక్షకుల ఎదుట.. తన సొంత జట్టు ఢిల్లీని బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. అంతేకాదు తన ఆట తీరుని విమర్శిస్తున్న వారందరికీ .. తన ఆట ద్వారానే సమాధానం చెప్పాడు. అయితే ఈ విజయం ద్వారా ఢిల్లీ జట్టు వరుసగా నాలుగు గెలుపులు సాధించినట్లు అయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఐదు మ్యాచ్ల్లో నాలుగు గెలుపుల ద్వారా గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇక ఈ ఓటమితో బెంగళూరు పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Also Read: ఎంఎస్ ధోని పోరాటసింహం.. ఓరయ్యా ఏం తాగి ఎడిట్ చేశార్రా?
WHAT A SHOT BY KL RAHUL. pic.twitter.com/FZnEoh8bcE
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2025