Homeక్రీడలుక్రికెట్‌KL Rahul: కేఎల్ రాహుల్ విశ్వరూపం.. బెంబేలెత్తిన పంజాబ్ బౌలర్లు.. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు

KL Rahul: కేఎల్ రాహుల్ విశ్వరూపం.. బెంబేలెత్తిన పంజాబ్ బౌలర్లు.. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు

KL Rahul: అది మామూలు కొట్టుడు కాదు.. వీర కొట్టుడు.. నాటు కొట్టుడు.. మాస్ కొట్టుడు.. హరి వీర భయంకరమైన కొట్టుడు.. బంతితో పగ ఉన్నట్టు.. బౌలర్లతో గెట్టి పంచాయతీ ఉన్నట్టు.. కొట్టాడు. అతడు కొడుతున్న తీరుకు బంతి పగులుతుందని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. దీనిని బట్టి అతడి బ్యాటింగ్ స్టైల్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఐపిఎల్ సీజన్లో పంజాబ్ జట్టు వరుసగా విజయాలు సాధించింది. పంజాబ్ జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. కానీ, తొలిసారి పంజాబ్ బౌలర్లు లయ తప్పారు. వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న ఢిల్లీ బ్యాటర్ల ముందు తలవంచారు. పంజాబ్ బౌలర్ల లోపాన్ని ఢిల్లీ బ్యాటర్లు అద్భుతంగా క్యాష్ చేసుకున్నారు.. ముఖ్యంగా ఢిల్లీ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏ ఆటగాడు సాధించని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్ ల సహాయంతో ఏకంగా 152* పరుగులు చేశాడు. తొలి వికెట్ కు 28 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అతడు.. రెండవ వికెట్ కు నితీష్ రానా(91) ఏకంగా 220 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఈ ఐపిఎల్ సీజన్లో ఇదే హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం.

పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ నాలుగు ఓవర్లు వేసి 49, బ్రాట్ లెట్ నాలుగు ఓవర్లు వేసి 69, యాన్సన్ నాలుగు ఓవర్లు వేసి 45, విజయ్ కుమార్ 3 ఓవర్లు వేసి 48, చాహల్ 4 ఓవర్లు వేసి 42, స్టోయినిస్ ఒక ఓవర్ వేసి 11 పరుగులు ఇచ్చారు. గత బెంగళూరు పై చిన్న స్వామి స్టేడియంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. కాంతారా స్టైల్లో సెలబ్రేషన్ చేసుకున్నాడు రాహుల్. ఈ సీజన్లో కూడా అంతకుమించిన స్థాయిలో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. ఏకంగా 152 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అతడి బ్యాటింగ్ ధాటికి పాత రికార్డులు మొత్తం గల్లంతయ్యాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version