ఎన్నికల్లో బరిలో నిలిచినా.. ఆటలో పోటీలో నిలిచినా.. ఏ పార్టీ అయినా.. ఏ జట్టు అయినా గెలిచేందుకే ప్రయత్నాలు సాగిస్తుంటాయి. కానీ.. ఎందుకో నిన్న ఐపీఎల్ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూస్తుంటే అందరిలో ఒక అనుమానం మొదలైంది. ఇరు జట్లు ఓడిపోయేందుకే ఈ మ్యాచ్ ఆడాయా అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముంబయి ఇండియన్స్ భారీ పరుగులు చేసే అవకాశాన్ని ఆ జట్టు చేజేతులా దూరం చేసుకుంది. కేవలం 152 పరుగులు చేసి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఆల్ ఔట్ అయింది.
అయితే.. 153 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు కూడా మొదట్లో మంచి ఫామ్‌ను కొనసాగించింది. ఒకానొక సందర్భంలో 15 నుంచి 16 ఓవర్లలోనే ఛేజింగ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. చివరికి కోల్‌కతా బ్యాట్స్‌మన్లు చేతులెత్తేయడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అసలు ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోతుందని ఎవరూ ఊహించనూ లేదు. 15 ఓటర్లలోనే 120 పరుగులు చేసిన కోల్‌కతా 33 పరుగులను అందుకోవడంలో తడబడింది.
వెంటవెంటనే వరుసగా వికెట్లను కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. చివరి ఐదు ఓవర్లలో పూర్తిగా మ్యాచ్‌ను ముంబయి ఇండియన్స్‌కు వదిలేశారు. నాలుగు ఓవర్లు ఆడిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్లు కేవలం 16 పరుగులు మాత్రమే తీయగలిగారు. ఆఖరి ఓవర్ బౌల్ట్ వేయగా.. ఆ ఓవర్‌లో కేవలం నాలుగంటే నాలుగు పరుగులు మాత్రమే రాబట్టగలిగారు. దీంతో చివరగా పది పరుగుల తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.