https://oktelugu.com/

KKR vs SRH IPL 2022: సన్ రైజర్స్ పని గోవిందా?

KKR vs SRH IPL 2022: హైదరాబాద్ సన్ రైజర్స్ వరుసగా ఓటములు చవిచూస్తోంది. ఐదు మ్యాచుల్లో ఓడి ప్లే ఆప్ అవకాశాలు వదులుకుంది. దీంతో ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతోంది. ఫలితంగా పతకాల పట్టికలో వెనుకబడిపోతోంది. కీలకంగా మారిన మ్యాచులో అపజయం పాలై అప్రదిష్ట మూటగట్టుకుంది. గెలవాల్సిన మ్యాచులో వెన్ను చూపి విమర్శల పాలైంది. శనివారం కోల్ కత నైట్ రైడర్స్ తో జరిగిన ఆటలో హైదరాబాద్ సన్ రైజర్స్ ఓడిపోవడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ దారుణమైన […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 15, 2022 / 10:22 AM IST
    Follow us on

    KKR vs SRH IPL 2022: హైదరాబాద్ సన్ రైజర్స్ వరుసగా ఓటములు చవిచూస్తోంది. ఐదు మ్యాచుల్లో ఓడి ప్లే ఆప్ అవకాశాలు వదులుకుంది. దీంతో ప్రేక్షకుల ఆగ్రహానికి గురవుతోంది. ఫలితంగా పతకాల పట్టికలో వెనుకబడిపోతోంది. కీలకంగా మారిన మ్యాచులో అపజయం పాలై అప్రదిష్ట మూటగట్టుకుంది. గెలవాల్సిన మ్యాచులో వెన్ను చూపి విమర్శల పాలైంది. శనివారం కోల్ కత నైట్ రైడర్స్ తో జరిగిన ఆటలో హైదరాబాద్ సన్ రైజర్స్ ఓడిపోవడం సంచలనం సృష్టించింది. హైదరాబాద్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుని ప్లే ఆప్స్ ఆశలను వమ్ము చేసుకుంది.

    KKR vs SRH IPL 2022

    మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత నైట్ రైడర్స్ 178 పరుగులు చేసింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 55 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ ప్లే ఆప్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మెరుగైన రన్ రేట్ సాధించి పతకాల పట్టికలో ఆరవ స్థానంలో నిలిచింది.

    Also Read: AP Senior Leaders: ఆ సీనియర్ నాయకులకు ఏమైంది?..వారి సైలెంట్ వెనుక కారణాలేంటి?

    సన్ రైజర్స్ పది పాయింట్లతో పతకాల పట్టికలో 8వ స్థానానికి చేరింది. దీంతో సజీవంగా ఉంచుకోవాల్సిన ఆశలను నిర్జీవం చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ విలియమ్సన్ 17 బంతుల్లో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా తొందరగానే వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్ కోలుకోలేకపోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 43 పరుగులు చేసినా వరుణ్ చక్రవర్తి అతడిని ఔట్ చేశాడు. దీంతో జట్టు అచేతన స్థితిలోకి వెళ్లింది.

    KKR vs SRH IPL 2022

    కేకేఆర్ జట్టులో ఆండ్రీ రస్సెల్ 28 బంతుల్లో 49 నాటౌట్ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. దీంతో కేకేఆర్ గెలుపు సునాయాసమైంది. స్యామ్ బిల్లింగ్స్ 29 బంతుల్లో 34 3 ఫోర్లు 1 సిక్స్ చేయడంతో కేకేఆర్ విజయం దక్కించుకుంది. మొత్తానికి సన్ రైజర్స్ ఓటమికి కేకేఆర్ విజయానికి ఆటగాళ్ల నిర్వాకమే కారణం. ఆటగాళ్ల ఎంపికలోనే విమర్శలు మూటగట్టుకున్న సన్ రైజర్స్ ఇప్పుడు అపజయాలతో అప్రదిష్ట మూటగట్టుకోవడం తెలిసిందే.

    Also Read:KCR vs BJP: కేసీఆర్ ను అధికారంలోంచి దించడం బీజేపీకి సాధ్యమేనా?

    Tags